ఉప్పొంగుతున్న ఎద అందాలతో రకుల్ ప్రీత్ సింగ్.. డిఫరెంట్ పోజులతో హాట్ ట్రీట్!

ఇంటర్ చదువు అయిపోయాక సెలవుల్లో కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్టీలోకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచిని ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. 7జీ బృందావన్ కాలనీ సినిమాకు రీమెక్ గా వచ్చిన గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది ఈ ఫిట్ నెస్ సుందరి. అనంతరం తెలుగులో పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్స్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిన స్టడీస్ కంప్లీట్ చేసింది. కొద్ది కాలం గ్యాప్ తర్వాత కెరటం అనే చిన్న సినిమాతో మొదలు పెట్టి అగ్ర హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన ఈ క్యూట్ భామ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ అభిమానులను మరింత అట్రాక్ట్ చేస్తోంది.

ఏం చేద్దామనే ఆలోచన లేనప్పుడు..

ఏం చేద్దామనే ఆలోచన లేనప్పుడు..


ఇంటర్ పూర్తి చేశాక ఏం చేద్దామనే ఆలోచన లేనప్పుడు కేవలం పాకెట్ మనీకోసం హీరోయిన్ గా నటించింది ఆర్మీ ఫ్యామిలీకి చెందిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లీ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలు మోపిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తూ సత్తా చాటుతోంది.

ప్రేమ విలువ తెలుసుకుని..

ప్రేమ విలువ తెలుసుకుని..

గిల్లీ సినిమా తర్వాత తెలుగులో కెరటం అనే చిన్న మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​. ఈ సినిమాలో సంగీతగా గోల్స్ కోసం కష్టపడే కాలేజీ అమ్మాయిగా, ఆ తర్వాత ప్రేమ విలువ తెలుసుకుని హీరో చెంతకు చేరే యువతిగా అలరించింది రకుల్. అయితే ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఈ సినిమా తర్వాత రకుల్ కు సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ మూవీలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది.

స్టార్ హీరోలతో జతకట్టే అవకాశం..

స్టార్ హీరోలతో జతకట్టే అవకాశం..

వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ సినిమా తర్వాత ఆది సాయి కుమార్ రఫ్​, గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి పలు సినిమాలు చేసింది. ఇలా వెనువెంటనే టాలీవుడ్ స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ కూల్ బ్యూటి రకుల్. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది.

రకుల్ కు కలిసి రాని అదృష్టం..

రకుల్ కు కలిసి రాని అదృష్టం..

బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలోకి మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్.. యారియాన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ రాలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది ఈ స్లిమ్ సుందరి రకుల్ ప్రీత్. హిందీలో కొంతకాలం సినిమాలు చేశాక లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడి కట్టిన ఈ భామకు లక్ వరించలేదు.

సినిమాలతో బిజీ.. కానీ..

సినిమాలతో బిజీ.. కానీ..

చాలా కాలం తర్వాత తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కొండపొలం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

కొత్త ఏడాదిలో పర్వాలేదనిపించి..

కొత్త ఏడాదిలో పర్వాలేదనిపించి..

అన్నింటికంటే బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ తో చేసిన కట్ పుట్లి సినిమా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ విడుదలై పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఛత్రీవాలీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలో విడదలైన ఈ సినిమాలో ఎవ్వరూ చేయనటువంటి పాత్ర అయిన కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ అలరించింది. ఈ సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ జీ5లో విడుదల చేశారు. జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

ఉప్పొంగుతూ దర్శనమివ్వడంతో..

సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది కూల్ బ్యూటి రకుల్. తాజాగా ముత్యాలు పొదిగినట్లుగా కనిపించే గోల్డ్ కలర్ లెహంగాలో హాట్ గా దర్శనం ఇచ్చింది ముద్దుగుమ్మ రకుల్. ఈ ఫొటోల్లో వయ్యారంగా పోజులిస్తూ తన ఎద, నడుము అందాలను ఆరబోసింది ఈ భామ. డిఫరెంట్ పోజుల్లో రకుల్ ఎద అందాలు ఉప్పొంగుతూ కనిపించడంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇవి వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X