కండోమ్స్‌తో ఆటాడుకోనున్న రకుల్ ప్రీత్.. ఆ మూవీలో మరింత హాట్ హాట్‌గా..
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో జోరును కొనసాగిస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. గ్లామర్‌తోపాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో గ్లామర్ డోస్‌ను పెంచుతూ పాత్రలను ఎంపిక చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నట్టు దర్శకుడు వెల్లడించడంతో ఆ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇంతకు రకుల్ పోషించే పాత్ర ఏమిటంటే..

వివాహితుడితో ప్రేమలో
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌పై రకుల్ ప్రీత్ సింగ్ కన్నేసింది. అజయ్ దేవగణ్‌తో కలిసి దే దే ప్యార్ దే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో మధ్య వయసు ఉన్న వివాహితుడితో ప్రేమలో పడిన యువతిగా హాట్ హాట్‌గా నటించింది.

కండోమ్ తయారు చేసే సంస్థలో ఉద్యోగిగా
తాజాగా బాలీవుడ్‌లో మరోసారి గ్లామర్ డోస్ పెంచే పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ తయారు చేసే కంపెనీలో వాటిని టెస్ట్ చేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు అని దర్శకుడు తేజాస్ దియోస్కర్ తెలిపారు. అయితే ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందని రూమర్లకు తెరదించారు.

రకుల్ ఆ పాత్రకు న్యాయం
కండోమ్ టెస్టర్ పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందనే ఆలోచిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ గుర్తుకు వచ్చారు. ఆ పాత్రకు రకుల్ అయితే బెస్ట్‌గా ఉంటుందని నాతోపాటు యూనిట్ సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ పాత్రకు ఆమె ఫ్రెష్‌నెస్ తెస్తుంది. సమాజంలో గొప్ప ఆలోచనను రేకెత్తించే పాత్రగా రూపొందుతుంది అనే అభిప్రాయాన్ని దర్శకుడు తేజాస్ దియోస్కర్ వ్యక్తం చేశారు.

పాత్ర గురించి వినగానే రకుల్ ప్రీత్
అయితే కండోమ్ టెస్టర్ పాత్ర గురించి రకుల్ ప్రీత్‌కు చెప్పగానే చాలా థ్రిల్‌గా ఫీలయ్యారు. ఆమెను ఈ సినిమా కోసం సంప్రదించగానే వెంటనే ఒకే చెప్పారు. కథ పూర్తిగా వినగానే ఆమె ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారు. ముంబైలో కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత షూటింగ్ మొదలు పెడుతాం అని తేజాస్ దియోస్కర్ తెలిపారు.
Recommended Video

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే..
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులు చేస్తున్నారు. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో డీ గ్లామరైజ్డ్ పాత్రను పోషిస్తున్నారు. హిందీలో సర్దార్ కా గ్రాండ్‌సన్, ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్, అయాలన్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











