Rakul Preet Singh రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. వామ్మో ఆ పాత్రకు ఓకే చేసిందా? డేరింగ్ ఉన్న అమ్మడే!

రకుల్​ ప్రీత్ సింగ్ ఈ పేరు తెలుగు సినీ ప్రియులకు పరిచయమే. ఒకప్పుడు టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా రాణించిన ఈమె ప్రస్తుతం తెలుగులో ఏ ఆఫర్​ లేకుండా ఉంటోంది. ఇతర భాషల్లో అడపా దడపా చిత్రాలు చేస్తూ కాస్త ఖాళీగానే ఉంటోంది. పర్సనల్​ లైఫ్​తో బిజీగా గడుపుతోంది. అయితే ఈ భామ హిందీ రామాయణంలో ఓ రిస్కీ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకుంటున్న అభిమానులు రకుల్​ డేరింగ్ అమ్మడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ నాజూకు భామకు వరించిన రిస్కీ పాత్ర ఏంటంటే?

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్​గా రాణించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. బడా స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​, కరెంట్​ తీగ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్ 2 లాంటి చిత్రాలతో ఆడియెన్స్​ను బాగా అలరించింది. అయితే అనంతరం బాలీవుడ్​లో పాగా వేసింది. అక్కడ పలు స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్​ కాలేకపోయింది.

Rakul Preet Singh To Play Key Role in Bollywood Ramayanam Full Details Here

రీసెంట్​గా తమిళంలో ఈ సంక్రాంతికి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.ఈ చిత్రం మంచి టాక్​నే అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో రన్ అవుతోంది. దీంతో పాటే కోలీవుడ్​లో దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన ఇండియన్ 2లోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఆమె చేతిలో ప్రస్తుతానికి పెద్దగా సినిమాలేమీ లేవు.

అయితే ఇప్పుడామెకు ఓ భారీ ప్రాజెక్ట్​ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. అదీ రిస్కీ పాత్ర అని తెలుస్తోంది. భారతీయులంతా గర్వాంగా చెప్పుకోదగ్గ సినిమాను రెడీ చేయబోతున్నానంటూ దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అదే సంపూర్ణ రామాయణం . ఈ రామాయణాన్ని మొత్తం మూడు భాగాలుగా తీసుకురానున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్యాస్టింగ్ పనులు కూడా సాగుతున్నాయి.

Rakul Preet Singh To Play Key Role in Bollywood Ramayanam Full Details Here

ఈ చిత్రంలోనే రావణాసురిడి చెల్లి శూర్ఫణఖ పాత్ర కోసం రకుల్​ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు హై స్కోప్ ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇది నెగటివ్ రోల్. ఈ పాత్రపై దర్శకుడు ప్రత్యేక దృష్టి పెట్టి మరీ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం అందింది. అలాగే సీత పాత్ర కోసం కూడా సాయి పల్లవి, రకుల్​ ప్రీత్ పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి రకుల్ ఈ పాత్రల్లో ఏదైనా ఒక దానిని ఓకే చేస్తుందా లేదా అని.

ఇంకా ఈ చిత్రంలో రాముడిగా రణ్​బీర్ కపూర్​ నటిస్తున్నారు. సీతగా ఇప్పటికే సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. హనుమంతుడిగా సన్నీ దేఓల్​, రావణుడి పాత్రలో కేజీయఫ్ ఫేమ్ యశ్ , కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడిగా విజయ్ సేతుపతి పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తారో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X