నితిన్, చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో స్టార్ హీరోయిన్!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాది ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇది కాక నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా ఒకే చెప్పాడు. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోని చిత్రం.
భీష్మ, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోని రెండు చిత్రాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోని చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రకుల్, నితిన్ కలసి నటించనుండడం ఇదే తొలిసారి.

ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. చంద్రశేఖర్ యేలేటి కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రానికి కూడా ఆయన అద్భుతమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక నితిన్ నటించబోతున్న మరో చిత్రం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రానికి పవర్ పేట్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











