దిక్కుతోచని స్థితిలో రకుల్ ప్రీత్ సింగ్... నిన్న రాత్రి నుంచి అక్కడే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిక్కుని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా రన్ వే మీదకు నీళ్లు రావడంతో ముంబై నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిన్న రాత్రి నుంచి రకుల్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.
ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు సోమవారం రాత్రి రకుల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలియడంతో విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా పరిస్థితి అలాగే ఉందని సమాచారం.

'ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన రాకపోకలు నడుస్తున్నాయా? ఎవరికైనా ఈ విషయం తెలిస్తే కాస్త చెప్పండి అంటూ సోనమ్ కపూర్ ట్విట్ చేయగా... రకుల్ వెంటనే స్పందించారు. సోమవారం రాత్రి నుంచి ఇక్కడి నుంచి విమానాలు నడవటం లేదు, దీంతో నేను ఇక్కడ చిక్కుకున్నాను' అంటూ రిప్లై ఇచ్చారు.
ముంబైలో జులై 5 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రస్తుతం వివిధ చిత్రాల్లో నటిస్తుండటంతో ఆమె తప్పకుండా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రకుల్ ప్రీత్ సంగ్ ప్రస్తుతం నాగార్జునతో కలిసి 'మన్మధుడు 2' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో శివ కార్తికేయన్ చిత్రం చేస్తోంది. ఆమె నటించిన హిందీ చిత్రం 'మర్‌జావాన్' షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











