Rakul Preet Singh కండోమ్ చేతిలో పట్టుకొని చిలిపిగా.. అలాంటి డేరింగ్ పాత్రలో అందాల భామ

గ్లామర్ తారగా రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదితోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నది. ఇటీవల కాలంలో తెలుగు, ఇతర భాషా సినిమాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకొంటున్నారు. తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలకు, పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇప్పటి వరకు ఎవరూ పోషించని కండోమ్ టెస్టర్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రకుల్ కెరీర్, తాజా సినిమా ఛత్రీవాలీ ఫస్ట్ లుక్ గురించిన వివరాల్లోకి వెళితే..

జాకీ భగ్నానీతో అఫైర్ గురించి

జాకీ భగ్నానీతో అఫైర్ గురించి

రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నిర్మాతతో ప్రేమలో పడినట్టు ఇటీవల తన పుట్టిన రోజున వెల్లడించింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో అఫైర్ కొనసాగిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో రకుల్ అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలా తన వ్యక్తిగత జీవితంలో మరో ఫేజ్‌ను రకుల్ కొనసాగిస్తున్నది.

 కొండపొలెం సినిమా నిరాశతో

కొండపొలెం సినిమా నిరాశతో

కెరీర్ ఫరంగా లాక్ డౌన్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కొండపొలం సినిమాతో ముందుకు వచ్చింది. డీ గ్లామర్ పాత్రలో ఆమె కనిపించారు. కానీ ఆ పాత్రను సరిగా పోషించలేదు. తన ఫెర్ఫార్మెన్స్‌‌తో రకుల్ ప్రీత్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయారనే వాదన, విమర్శలు బలంగా వినిపించాయి. కొండపొలెం సినిమా ఆశించినంతగా విజయం సాధించలేకోవడంతో రకుల్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఛత్రీవాలీలో కండోమ్ టెస్టర్‌గా

ఛత్రీవాలీలో కండోమ్ టెస్టర్‌గా

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్‌వీపీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఛత్రీవాలి ప్రాజెక్ట్‌పై రకుల్ ప్రీత్ ఆశలు పెట్టుకొన్నది. ఈ చిత్రంలో కండోమ్‌లను పరీక్షించే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇటీవలే లక్నోలో షూట్ ప్రారంభమైంది.

కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌గా రకుల్ ప్రీత్

కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌గా రకుల్ ప్రీత్

హర్యానాలోని కర్నల్ అనే ప్రదేశానికి చెందిన కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌గా రకుల్ ప్రీత్ నటిస్తున్నది. ఛత్రీవాలి చిత్రంలో కండోమ్ టెస్టర్‌గా కనిపించబోతున్నారు. ఛత్రీవాల డిఫరెంట్ డ్రామా చిత్రం.. హై కాన్సెప్ట్ ఫిలిం. ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కండోమ్ వాడకం గురించి

కండోమ్ వాడకం గురించి

డైరెక్టర్ తేజాస్ డియోస్కర్ మాట్లాడుతూ... ఛత్రీవాలీ చిత్రం సోషల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కండోమ్ వాడకం గురించి అవగాహన కల్పించే చిత్రం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెష్ లుక్ తీసుకువచ్చింది. కొత్త ఆలోచనలను రేకెత్తించే చిత్రంగా నిలుస్తుంది. కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది అని అన్నారు.

అన్ని సినిమాల మాదిరిగా ఉండదు..

అన్ని సినిమాల మాదిరిగా ఉండదు..

ఛత్రీవాలా సినిమా గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ... ఛత్రీవాలీ చిత్రం అన్ని సినిమాల మాదిరిగా ఉండదు. ఓ వినూత్నమైన కథ, కథనాలతో రాబోతుంది. నా కెరీర్‌లో ఇలాంటి పాత్రను ఇప్పటి వరకుపోషించలేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వెళ్తుందా అని చాలా ఎక్సైటింగ్‌తో ఉన్నాను అని రకుల్ ప్రీత్ అన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా..

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా..

లాక్‌డౌన్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో ఇండియన్ 2, ఆయాలాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. మరికొన్న చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X