మరీ కొంటె పిల్లలా ఉందే!.. రకుల్ క్యూట్ పిక్ వైరల్
రకుల్ ప్రీత్ సింగ్.. లాక్ డౌన్‌లో ఫుల్ సందడి చేస్తోంది. ఇంట్లో ఆటలు ఆడుతూ, వంటలు వండుతూ తెగ హల్చల్ చేస్తోంది. అసలే షూటింగ్‌లంటూ క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్.. ఇలా ఖాళీగా దొరికిన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటోంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో విలువైన సమయాన్ని గడుపుతూ సంతోషంగా ఉంది. తాజాగా రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది.
లాక్ డౌన్ సమయంలో రకుల్ చేసినంత అల్లరి మిగతా ఏ హీరోయిన్లు చేసి ఉండరు. సోదరుడితో కలిసి ఆటలాడుకుంటూ చిన్న పిల్లలా మారింది. తండ్రి చేతితో సేవలు చేయించుకుంటూ మహారాణిలా ఫీలైంది. బయటకు వచ్చి సాధారణ యువతిలా మందులు కొనుక్కుని వెళ్లింది. తప్పుగా వార్తలు రాసిన వెబ్ సైట్స్ సెటైర్సే వేసింది. నిత్యం ఏదో ఒక విషయంలో రకుల్ వార్తల్లో నిలుస్తూ వచ్చేది.

నేడు వరల్డ్ ఎమోజీ డే. ఈ సందర్భంగా రకుల్ ఓ పోస్ట్ చేసింది. మీ వ్యక్తిత్వానికి సరిపోయే ఎమోజీ ఏంటో చెప్పండని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు కన్నుకొడుతున్న ఓ ఫోటోను రకుల్ షేర్ చేస్తూ.. 'వరల్డ్ ఎమోజీ డే.. నాకు ఎల్లప్పుడూ నచ్చే ఎక్స్‌ప్రెషన్ ఇదే. నా స్నేహితులు కచ్చితంగా అది అంగీకరిస్తారు. మిమ్మల్ని తెలిపే ఎమోజీ ఏంటో నాతో పంచుకోండ'ని రకుల్ కోరింది. మొత్తానికి రకుల్ తన ఎమోజీ పోజ్‌ను షేర్ చేసి కొంటె పిల్లని అని చెప్పనకనే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











