నీ దూకుడు సాటేవ్వరు.. రకుల్ వర్కౌట్లు వైరల్
రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో కంటే జిమ్‌లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు జిమ్ సెంటర్లను క్లోజ్ చేసి ఉంచారు. దీంతో రకుల్ ఇంట్లోనే ఓ వ్యాయామా శాలను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. జీరో సైజ్ మెయింటెన్ చేయడానికి రకుల్ ప్రీత్ తెగ కష్టపడుతోంది. ఒకప్పుడు కాస్త ముద్దుగా, బొద్దుగా ఉన్న రకుల్.. పూర్తిగా మారిపోయింది. రకుల్ శరీరాకృతిలో వచ్చిన మార్పులకు అభిమానులు కూడా పెదవి విరుస్తుంటారు.
లాక్ డౌన్ సమయంలో రకుల్ ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుటుంబంతో కలిసి ఇంట్లో ఆటపాటలు ఆడుతూ రచ్చ రచ్చ చేసింది. మరీ ముఖ్యంగా సోదరుడితో కలిసి.. చిన్న పిల్లగా మారిపోయిన నాటి ఆటలను ఆడింది. వీటికి సంబంధించిన వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక అంతటి క్లిష్ట పరిస్థితిలోనూ రకుల్ మాత్రం వ్యాయామాన్ని విడిచిపెట్టలేదు. నిత్యం వర్కౌట్లు చేస్తూ బక్క చిక్కిపోతోందని బయట టాక్ వినిపిస్తోంది.

తాజాగా రకుల్ వర్కౌట్లు చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. ఇంట్లోనూ జిమ్ ఏర్పాటు చేసి సోదరుడితో కలిసి వ్యాయామం చేస్తోంది. ఇక మహేష్ బాబు స్టైల్లో నీ దూకుడు సాటెవ్వరూ అన్నట్టుగా పరిగెత్తుతూ ఉంది. తాడుతో రకుల్‌ను పట్టి ఉంచగా.. దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోన్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రకుల్ ప్రస్తుతం తెలుగులో అంత బిజీగా లేదు. వరుసగా ఫ్లాపులు వస్తుండటంతో రకుల్ కాస్త వెనుకబడింది. ప్రస్తుతం రకుల్ హిందీ, తమిళ భాషల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











