బుట్టబొమ్మ కంటే వేగంగా రకుల్ ప్రీత్ సింగ్.. రెమ్యునరేషన్ లో కూడా తగ్గడం లేదు
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ మామూలుగా లేదు. ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఎక్కువగా ఉండడం వలన తెలుగులో అయితే అగ్ర హీరోయిన్స్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఇక మొన్నటి వరకు పూజా హెగ్డే, రష్మీక మందన్న వంటి హీరోయిన్స్ కు అగ్ర హీరోల నుంచి ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక రకుల్ లాంటి బ్యూటీని ఎవరు పట్టించుకోవడం లేదని అనుకుంటున్న తరుణంలో ఆమె దిమ్మితిరిగేలా బాలీవుడ్ లో సినిమాలను ఒకే చేస్తోంది.

షాక్ ఇస్తున్న రకుల్
వెంకటాది ఎక్స్ ప్రెస్ సినిమాతో బాక్సాఫీస్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అంతకుముందు కూడా ఒకటి రెండు సినిమాలో చిన్న రోల్స్ చేసింది. నిజానికి రకుల్ స్టార్ హీరోలతో అవకాశం అందుకుంటుందని మొదట్లో ఎవరు ఊహించి ఉండరు. కానీ ఆమె మాత్రం వరుసగా ఆఫర్లు అందుకుంటూ అగ్ర హీరోయిన్స్ కు షాక్ ఇస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే అమ్మడు వరుసగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టడం విశేషం.

బుట్టబొమ్మ కంటే వేగంగా..
నిజానికి గత కొంతకాలంగా ఈ బ్యూటీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ లేదు. మన్మథుడు 2తో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం పూజా హెగ్డే తన గ్లామర్ డోస్ తో బిగ్ బడ్జెట్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఒక విధంగా బుట్టబొమ్మ బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది గాని రకుల్ రేంజ్ లో అయితే వేగంగా ఛాన్స్ లు అందుకోవడం లేదు.

ఆయుష్మాన్ ఖురానాతో.. గోల్డెన్ ఛాన్స్
ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది రకుల్. తెలుగులో గత కొంతకాలంగా అపజయాలను ఎదుర్కొంటున్న రకుల్ ఎలాగైనా నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందుకోవాలని అనుకుంటోంది. హిందీలో మేడే సినిమాతో పాటు జాన్ అబ్రహం ఎటాక్ అలాగే సర్దార్ అండ్ గ్రాండ్సన్ అనే మరో సినిమా చేస్తోంది.

సౌత్ లో బిజీగా..
ఇక తెలుగులో ఇటీవల క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాను పూర్తి చేసింది. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నితిన్ ఛెక్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో ఇండియన్ 2లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రకుల్ శివకార్తీకేయన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.
Recommended Video

కోటిన్నర చెబుతున్నా..
రకుల్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా లేకపోయినా కూడా ఆమె రేటు కోటికి తగ్గడం లేదట. బీ టౌన్ లో ఓ మీడియం బడ్జెట్ సినిమాలకు రకుల్ ను ఏరికోరి మరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక కోటిన్నర చెప్పినా కూడా ఆమెకు ఆఫర్స్ తగ్గడం లేదు. బాలీవుడ్ లో మారికొన్ని. కథలపై కూడా ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











