కరోనా నుంచి బయటపడిన హీరోయిన్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది!
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. కొద్దిపాటి లక్షణాలు ఏమి లేకపోయినా కూడా టెస్టుల అనంతరం పాజిటివ్ అని తెలియగానే ఆమె క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. హీరోయిన్ తమన్నా తరువాత మరో టాలీవుడ్ బ్యూటీ కరోనా భారిన పడినట్లు వార్తలు రావడంతో ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఆమె వైరస్ నుంచి బయటపడింది.
అజయ్ దేవ్‌గన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ మేడే చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ అప్పుడే కోవిడ్ -19 భారిన పడటం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఫైనల్ గా ఆమె చికిత్స అనంతరం ఈ రోజు నెగెటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ఇక త్వరలో షూటింగ్స్ లలో కూడా పాల్గొంటున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న అమ్మడు ఎలాగైనా నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందుకోవాలని అనుకుంటోంది. హిందీలో మేడే సినిమాతో పాటు జాన్ అబ్రహం ఎటాక్ అలాగే సర్దార్ అండ్ గ్రాండ్సన్ అనే మరో సినిమా చేస్తోంది. ఇక తెలుగులో ఇటీవల క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాను పూర్తి చేసింది. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నితిన్ ఛెక్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో ఇండియన్ 2లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రకుల్ శివకార్తీకేయన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.


Click it and Unblock the Notifications











