మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సక్సెస్ లేకపోయినా కూడా బాలీవుడ్ అవకాశాలు గట్టిగానే అందుకుంటోంది. 2019లో తమిళ్ హిందీ తెలుగులో కలిపి నాలుగు సినిమాలు చేసిన అమ్మడు ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. మన్మథుడు 2 సినిమా అయితే అమెకున్న క్రేజ్ ను ఒక్కసారిగా తగ్గించేసింది. దీంతో అవకాశాలు దొరుకుతాయో లేదో అనే కామెంట్స్ చాలానే వచ్చాయి.
కానీ తెలుగులో పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా కూడా హిందీ సినిమాల్లో మాత్రం మంచి అవకాశాలు వచ్చాయి. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో కూడా ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో క్రిష్, వైష్ణవ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అలాగే నితిన్ చెక్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటి బాలీవుడ్ లో లేటెస్ట్ గా థాంక్స్ గాడ్ అనే సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదివరకే అజయ్ తో రకుల్ రెండు సినిమాలు చేసింది. వాటితో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు మరొకసారి హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడానికి డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కూడా రకుల్ అయ్యరి, మార్జావాన్ చిత్రాల్లో నటించింది. మరి కొత్త సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











