Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ హీరో డైరెక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్
ఒక సినిమా హిట్టయితే హీరోయిన్స్ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని కథలను సెలెక్ట్ చేసుకుంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈజీగా ఒక ట్రాక్ సెట్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ విధంగానే అడుగులు వేస్తోంది. ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని సక్సెస్ లో ఎక్కువ రోజులు ఉండడం లేదు. నమ్మకం పెట్టుకున్న సినిమాలే దారుణంగా దెబ్బకొట్టాయి.
స్పైడర్ అనంతరం ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించిన సినిమా మన్మథుడు 2. ఆ సినిమా తరువాత కొన్నాళ్ల పాటు రకుల్ కి తెలుగులో సరైన ఆఫర్స్ రాలేదు..ఎక్కువగా హిందీ ఆఫర్స్ రావడంతో మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది. ఇక తెలుగులో అయితే రకుల్ కథలు నచ్చకపోవడం వలనే రిజెక్ట్ చేసినట్లు టాక్ కూడా వచ్చింది. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను అయితే పూర్తి చేసింది. నితిన్ ఛెక్ సినిమాలో కూడా నటిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే రకుల్ ఒక స్టార్ హీరో డైరెక్షన్ కో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగన్. ఇదివరకే ఒకసారి దేదే ప్యార్ దే అనే సినిమాలో నటించిన ఈ జోడి బాక్సాఫీస్ హిట్ అందుకుంది. ఇక నెక్స్ట్ అజయ్ సొంత ప్రొడక్షన్ లోనే ఒక సినిమా చేయబోతున్నాడు. దర్శకుడు కూడా తనే. ఆ సినిమాలో రకుల్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చే నెల ఎండింగ్ లో షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారట. ఈ సినిమా హిట్టయితే రకుల్ పూర్తిగా బాలీవుడ్ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.