మళ్లీ షూటింగ్‌కు రకుల్.. డైరెక్టర్ క్రిష్ స్పెషల్ షెడ్యూల్
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ లో మొదటిసారి NCB ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో పాటు కేవలం ఆమె రియా చక్రవర్తితో క్లోజ్ గా ఉండడం వలన ఎన్సీబి విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక మొదటిసారి రకుల్ వలన క్రిష్ కొత్త సినిమాకు బ్రేకులు పడ్డాయి. వైష్ణవ్ తేజ్ సినిమాతో క్రిష్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ఇటీవల సడన్ గా NCB నుంచి సమన్లు అందడంతో వెంటనే విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో గత కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా నిర్వహిస్తున్న షూటింగ్ కి ఆమె లేకపోవడం వలన పెద్ద ఎఫెక్ట్ పడింది. షెడ్యూల్ లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ఇక మళ్ళీ ఫ్రెష్ గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. మొత్తానికి హైదరాబాద్ కి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కోసం క్రిష్ స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ముందుగా ఆమెకు సంబంధించిన మేజర్స్ సీన్స్ అన్నిటినీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఒకవేళ హఠాత్తుగా మళ్ళీ విచారణకు హాజరుకావాల్సి వస్తే షూటింగ్ పై ఎఫెక్ట్ పడకూడదని క్రిష్ ఈ విధంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఆమె విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు కూడా టెన్షన్స్ పడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. ఇక మరోసారి రకుల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఇక ప్రస్తుతం రకుల్ విషయంలో నేషనల్ మీడియా కొంచెం ఆచితూచి కథనాలు ప్రసారం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











