మొత్తానికి మెగా హీరోని పట్టేసిన రకుల్.. ఈసారైనా సక్సెస్ అవుతుందా?
టాలీవుడ్ హాట్ బ్యూటీగా ఒకప్పుడు చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ కాలం ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేక పోయింది. వరుస అపజయాలు అందడమే కాకుండా రకుల్ చేసిన పాత్రలపై కూడా తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ మధ్య మన్మథుడు 2లో మరింత బోల్డ్ గా కనిపించి ట్రోలింగ్ కి గురైన రకుల్ చర్చల దశలో ఉన్న ఆఫర్స్ ని కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
ఆ తరువాత కేవలం తమిళ్, బాలీవుడ్ సినిమాలతోనే కాస్త బిజీగా మరే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు ఏమి దక్కలేదు. ఇక మొత్తానికి తెలుగులో అమ్మడు ఒక మంచి ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒక సందేశాత్మక సినిమాలో నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయిన క్రిష్ హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథలో సోషల్ మెస్సేజ్ ఉండడంతో బేబీకి ఇన్నాళ్లు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ని పొగట్టుకునే అవకాశం వచ్చినట్లయ్యింది. మరి రకుల్ ఈ ఛాన్స్ తో అయినా తెలుగులో మళ్ళీ బిజీ అవుతుందో లేదో చూడాలి. ఇక దర్శకుడు క్రిష్ ఆల్ రెడీ పవన్ కళ్యాణ్ తో ఒక హిస్టారికల్ ప్రాజెక్టును సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా అంత పెద్ద సినిమాలని ఇప్పుడు తెరకెక్కించడం సాధ్యం కాదని ఒక చిన్న సినిమాను సెట్స్ పైకి తెస్తున్నారు. మరి షూటింగ్ ని ఎంత స్పీడ్ గా ఫినిష్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











