Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓటీటీలోనే వరుసగా మూడు సినిమాలు.. రకుల్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. గతంలో కనిపించిన స్టార్ హీరోయిన్స్ ఈ మధ్య అగ్ర నటులు ప్రాజెక్టులలో పెద్దగా కనిపించడం లేదు. అలాంటి హీరోయిన్స్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తమన్నా, సమంత, కాజల్ వంటి సీనియర్ హీరోయిన్స్ హవా కొనసాగుతున్న సమయంలో రకుల్ వారికి గట్టి పోటీని ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఎంచుకున్న పెద్ద సినిమాలే ఊహించని దెబ్బ కొట్టాయి.
ఇక నెక్స్ట్ ఎలాగైనా మిడియామ్ బడ్జెట్ సినిమాలతోనే సక్సెస్ కొట్టాలని చూస్తోంది. అలాగే తాప్సి తరహాలో బాలీవుడ్ లో అయినా హీటెక్కించాలని కష్టపడుతోంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇక ఆమె లక్కేమిటో గాని ఓటీటీలో వరుసగా మూడు సినిమాలు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వెండితెరపై తన గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూసిన అమ్మడి కోరిక ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
క్రిష్ దర్శకత్వంలో చేసిన ఒక చిన్న సినిమా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు ముందే క్లారిటీ ఇచ్చారు. ఇక అర్జున్ కపూర్ తో బాలీవుడ్ లో చేస్తున్న సినిమా కూడా ఓటీటీ రిలీజ్ అని తేల్చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక మరోవైపు నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ లోనే విడుదల కానున్నట్లు ఒక రేంజ్ లో రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని రకుల్ ఎన్ని సినిమాలు చేసినా ఇంకా ఆమె పూర్తి స్థాయిలో ఫామ్ లోకి రాలేదనే కామెంట్స్ వస్తున్నాయి.