వరినాట్లు వేస్తానంటోన్న రకుల్... క్రిష్ సినిమాలో వ్యవసాయకూలీగా...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలసి పనిచేయాల్సిన క్రిష్ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడనే చెప్పాలి. ఇక ఈ స్టార్ డైరెక్టర్ కూడా వెబ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో ఓ వెబ్ ఫిల్మ్ కు శ్రీకారం చుట్టిన క్రిష్, రకుల్ ప్రీత్ సింగ్ తో ప్రయోగాలు చేయించేందుకు సిద్ధమవుతున్నాడట.

క్రిష్ సినిమాలో రకుల్ ప్రీత్ తన కెరీర్ లోనే తొలిసారి ఓ డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించేందుకు సిద్ధమైందట. దట్టమైన అటవీ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీలో రకుల్ ఓ వ్యవసాయ కూలీగా కనపించబోతోందట. అంతేకాదు, ఈ సినిమాలో అమ్మడికి జోడీగా ఓ మెగా హీరోకూడా రంగంలోకి దిగబోతున్నాడట.

Rakul to potray a de glamarous role

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిన షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైపోయింది. చిన్న సినిమానే కావడంతో షూటింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచనతో కరోనా సమయంలోనూ చకచకా షెడ్యూల్ పూర్తి చేసేస్తున్నారు. ఇకపోతే రకుల్ కు జోడీగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించబోతున్నాడట. మరి ఇప్పటివరకూ గ్లామర్ కోట దాటి బయటకు రాని రకుల్, కూలి పాత్రకు ఎంతవరకూ న్యాయం చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X