Rakulpreet Singh: అందాల వడ్డింపుతో అదరగొడుతున్న రకుల్ - ఓ రేంజ్ లో గ్లామర్
Rakulpreet Singh: తెలుగు సినీ రంగంలోని అందరు అగ్రహీరోలతో నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరటం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొని అందినకాడికి సంపాధించుకుంది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, ధృవ, నాన్నకు ప్రేమతో, కిక్2, మన్మథుడు 2 లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించింది.
గతంలో అనేక సినిమాల్లో నటించి మెప్పించిన ఈ క్యూట్ బ్యూటీకి ఈ మధ్య అంతగా అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ ఏమీ నిరాశ పడకుండా నెట్టింటి వేదికగా రచ్చ చేస్తోంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతూ.. కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. అందాల వడ్డింపులో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెగ రచ్చ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది ఈ క్యూట్ బ్యూటీ. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందిరనీ అలరిస్తోంది.

వైట్ అండ్ వైట్ లాంగ్ గౌన్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ జుట్టును పైకి కట్టుకుంది. మెడలో, చేతులకు ఏం వేసుకోకుండానే ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అదరిపోయే లుక్ ఇస్తూ అందరి చేత ఆహా అనిపిస్తోంది. ఎద అందాలతో పాటు మెడ, నడుము అందాలకు కూడా చూపిస్తూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తోంది. కూర్చొని, నిలబడి, డ్రెస్సును తిప్పేస్తూ.. కైపుగా చూస్తూ.. కింద నుంచి పైవరకు అన్ని అందాలను ఆరబోసింది. రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ ఫొటోలకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

రకుల్ ప్రీత్ ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. అలాగే వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇంత అందమైన అమ్మాయికి సినిమా అవకాశాలు రాకపోవడం చాలా దారుణం అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేయగా... త్వరలోనే మంచి అదిరిపోయే సినిమాతో వచ్చి మనల్ని అలరిస్తుందని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. దర్శక, నిర్మాతల కళ్లల్లో పడి సినిమా అవకాశాలు తెచ్చుకోవాలని రకుల్ చాలానే ట్రై చేస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేస్తోంది.

టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రకుల్ ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్ కు కూడా రావట్లేదు. ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది. తాజాగా ఈ అద్భుతమైన డ్రెస్సును వేసుకొని ఓ అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయింది. ఆ సందర్భంగానే ఫొటోలు దిగిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట షేర్ చేసింది. అలాగే ప్రతిదాంట్లో అందం ఉంటుందని, అయితే అందరూ దాన్ని చూడలేరంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











