Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Esha Gupta: లో దుస్తుల్లో చరణ్ హీరోయిన్ అరాచకం.. అలాంటి పోజులో ఘోరంగా చూపిస్తూ!
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. దీన్ని ఫ్లాట్ ఫామ్ గా చేసుకుని అనేకమంది హీరోహీరోయిన్లు అభిమానులు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సినీ కెరియర్, పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే అప్ కమింగ్ నటీమణులతోపాటు ఇదివరకే ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్లు సైతం సోషల్ మీడియాను గ్లామర్ ట్రీట్ కోసం ఉపయోగిస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషా గుప్తా ఒకరు.

హద్దు లేని సాధనంగా..
సామాజిక మాధ్యమాల్లో సాధారణ యువతీయువకులే కాకుండా పాపులర్ హీరోహీరోయిన్లు కూడా రచ్చ చేస్తున్నారు. ప్రధానంగా హీరోయిన్లు అయితే అందాల ఆరబోతకు హద్దు లేని సాధానంగా ఉపయోగించుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గితే వాళ్ల క్రేజ్ ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు, అలాగే సినీ ఆఫర్లు వస్తున్నా.. వాటి ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడేస్తున్నారు.

హైలెట్ అవుతున్న ఇషా..
ఇలా సోషల్ మీడియాతో విపరీతంగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో హిందీ హాట్ భామ ఇషా గుప్తా ఒకరు. ఎంతో కాలం నుంచి మోడలింగ్ రంగంలో రాణించిన హాట్ భామ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రొమాన్స్ తో అరాచకం..
జన్నత్ 2 సినిమాతో హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో ఘాటు చుంబన సీన్లలో నటించింది. దీంతో యూత్ కు ఆమె హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది. ఈ సినిమాలో రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో ఆడిపాడింది.

నిషా కళ్ల భామ ఇషా..
హాట్ ముద్దుగుమ్మ ఇషా గుప్తా ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ఇషా గుప్తా. సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా.

ఐటమ్ సాంగ్స్ లో ఆడిన బ్యూటి..
ఇషా గుప్తా పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇదే కాకుండా గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి ఆకట్టుకుంది ఈ సుందరి. ఈ మూవీలో మరో బాలీవుడ్ భామ కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే.

బాబీ డియోల్ తో రొమాన్స్..
ఇలా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా గుప్తా ప్రముఖ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. బాబీ డియోల్ మెయిన్ లీడ్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ పండించింది. ఇందులో తన హాట్ నెస్ తో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ వినిపించింది. ఇలా హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయింది ఇషా గుప్తా.
|
లో దుస్తుల్లో అరాచకం..
సినిమాలు, సిరీస్ లు, ప్రేమాయణాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన హాట్ నెస్ ను ప్రదర్శిస్తోంది ఇషా గుప్తా. నగ్నంగా, హాఫ్ నేక్ డ్ ఫొటోలు పెడుతూ బీభత్సం సృష్టిస్తుంటుంది. తాజాగా మరోసారి అలాగే చేసింది. లో దుస్తుల్లో ధరించిన ఇషా సోఫాపై మోకాళ్లతో కూర్చుని పోజు ఇచ్చింది. ఈ ఫొటోలో తన ఎద, నడుము, బ్యాక్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.