రామ్ చరణ్‌తో డ్యాన్సింగ్ సెన్సేషన్ మాస్ స్టెప్పులు.. పెద్ది ఐటెమ్ సాంగ్‌లో హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పెద్ది'. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చి బాబు కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్ప్ తో ఇండియా మొత్తం పెద్ది రీసౌండ్ వినిపించింది. కాగా తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్లితే..

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వివరాలు..
ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం విశేషం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Ram Charan Buchi Babu Peddi Movie Special Song Heoine

పెద్ది సినిమా స్టోరీ లైన్ ఇదే..
బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్ మెంట్ గా ఏర్పడి ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశమని తెలుస్తోంది. ఈ క్రమంలో మెనేజ్ మెంట్ కు, ఆటగాళ్లకు మధ్య సాగే పోరే ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లింప్స్ తో హామీనిచ్చారు.

యంగ్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్..
పెద్ది.. చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. పెద్ది చిత్రంలో బుచ్చిబాబు మాస్ ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశారంట. అందులో రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఊరమాస్ స్టెప్పులు వేయబోతుందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీలా 'పుష్ప2'లో అల్లు అర్జున్ సరసన 'కిస్సిక్' సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందేనే. ఇక రామ్ చరణ్ తో చేస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు.

పెద్ది సినిమా విడుదల తేదీ..
విలేజ్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపు దిద్దుకుంటున్న 'పెద్ది' చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫిషీయల్ అనౌన్స్ మెంట్ కూడా అందాల్సి ఉంది.

Take a Poll

More from Filmibeat

Read more about: ram charan sreeleela tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X