అలియా భట్ కూతురుకు ఆ ప్రమాదం.. అప్రమత్తమైన బాలీవుడ్ హీరోయిన్.. ఏమైంది?
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' తో సౌత్ఆడియన్స్ కూడా బాగా దగ్గరయింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ గుండెల్లోనూ ప్రత్యేక స్నానం సంపాదించుకుంది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ భార్య కూడా కావడంతో సౌత్ లో మరింతగా గుర్తింపు పొందింది.
ఇదిలా ఉంటే... రణబీర్ కపూర్ అలియా భట్ కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ 14న వీరి వివాహం ముంబైలో అత్యంత గ్రాండ్గా జరిగింది. ఇక అదే ఏడాది ఆలియా భట్ ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అదలా ఉంటే 2022 నవంబర్ 9న అలియాభట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రాహ అని నామకరణం కూడా చేశారు.

కూతురు పుట్టిన తర్వాత అలియా భట్ ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతోంది. అనుకూలంగా ఉంటే మాత్రమే ఆయా చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. లేదంటే సమయం మొత్తం కూతురు రాహాను, భర్త రన్బీర్ కపూర్ ను చూసుకునేందుకు సమయం కేటాయిస్తోంది. అంతేకాదు టైం కుదుర్చుకొని మరి ఫ్యామిలీ టూర్స్ కు వెళ్తూ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంటూ ఉండేది.
అభిమానుల కోసం భర్త రన్బీర్ తో దిగిన ఫోటోలే కాకుండా కూతురికి సంబంధించిన ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఉండేది. ఇటీవల జాంనగర్, ప్యారిస్ ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను కూడా తన అభిమానులతో సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్స్ ద్వారా పంచుకుంది. ఆ ఫోటోలను అభిమానులు, ఫాలోవర్స్ లైక్స్ షేర్స్ తో ఇంటర్నెట్లో వైరల్ చేశారు. కానీ ఏమైందో గాని ఉన్నట్టుగా ఉండి ఆలియా భట్ తన కూతురు రాహ ఫోటోలను, మరిన్ని పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించింది.
ఈ విషయాన్ని అలియా భట్ అభిమానులు గమనించారు. ఎందుకని చిన్నారి రాహా ఫోటోలను డిలీట్ చేయాల్సి వచ్చిందని అలియా భట్ ను కామెంట్ల రూపంలో ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అలియా భట్ తన కూతురు విషయంలో ఏదో ప్రమాదాన్ని గ్రహించిందని, సోషల్ మీడియా ద్వారా కొందరు మోసాలు చేస్తున్న తరుణంలో అలియా జాగ్రత్త పడిందని భావిస్తున్నారు.
ఇటీవల సైఫ్ అలీ ఖాన్, జెహుకు జరిగిన ఘటనల ఆధారంగా రాహ గోప్యత దృష్ట్యా ఫోటోలను డిలీట్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయమే రాహాను మీడియా కంట పడకుండా కొన్ని నెలల పాటు దాచి ఉంచిన సంగతి తెలిసిందే. మొత్తానికి రాహ భద్రతపై అలియా మందస్తుగానే జాగ్రత్తలు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని అభిమానులు కూడా సమర్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications











