Heroine: ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న చరణ్ హీరోయిన్... ఫోటోలు చూశారా?

హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసి.. క్రేజ్ సంపాదించుకుంది. రామ్ చరణ్ నాయక్ సినిమాలో కూడా ఈ భామ యాక్ట్ చేసింది. ఇక ఇదిలా ఉండగా.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆయనకు ప్రపోజల్ పెట్టిన ఈ భామ.. ఈరోజు పెళ్లాడింది. అయితే ఈ భామకు ఇది రెండో పెళ్లి. ఆ ఫోటోలు, ఆమె లవ్ స్టోరీపై ఓ సారి లుక్ వేయండి.

హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ భామకు ఇదివరకే పెళ్లి అయి.. విడిపోయారు. అయితే తాజాగా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తన ప్రియుడు, ఈవెంట్ మేనేజ‌ర్ జ‌గ‌త్ దేశాయ్‌ను పెళ్లాడింది ఈ బ్యూటీ. కేర‌ళ‌లోని కొచ్చిలో ఆదివారం న‌వంబ‌ర్ 5వ తేదీన వీరి వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. ఇక ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా.. వధూ వరులు ఇద్దరు తెలిపారు.

Ram Charan Heroine Amala Paul Marries Jagat Desai at Kochi Photos Viral in Social Media

ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చూస్తూ.... 'రెండు మ‌న‌సులు ఒక్క‌టైన వేళ‌.. జీవితాంతం ఈ చేయి వ‌ద‌ల‌ను' అని త‌మ పోస్టుకు క్యాప్ష‌న్ జోడించారు వీరు. ఈ పెళ్లి వేడుక‌లో అమ‌లాపాల్ లావెండ‌ర్ క‌ల‌ర్‌ లెహంగా వేసుకోగా... జ‌గ‌త్ కూడా ప్రియురాలికి మ్యాచింగ్‌ గా లావెండ‌ర్ క‌ల‌ర్ షేర్వాణీ ధరించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా మారాయి. ఇక సెల‌బ్రిటీలు, అభిమానులు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Ram Charan Heroine Amala Paul Marries Jagat Desai at Kochi Photos Viral in Social Media

కాగా ఇటీవల అమలా పాల్ తన పుట్టిన రోజు సందర్భంగా జగత్ కు ప్రపోజల్ పెట్టింది. దీంతో ఆమె బర్త్ డే పార్టీలోనే జగత్.. మోకాళ్ల‌పై కూర్చుని న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని అంద‌రి ముందే అడిగి షాక్ ఇచ్చాడు. మొద‌ట స‌ర్‌ ప్రైజ్ అయిన అమ‌లాపాల్ వెంట‌నే న‌వ్వుతూ ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. దీంతో ఆ క్ష‌ణ‌మే హీరోయిన్‌కు ఉంగ‌రం తొడిగి పెళ్లికి రెడీ అయిపోయింది ఈ భామ.

Ram Charan Heroine Amala Paul Marries Jagat Desai at Kochi Photos Viral in Social Media

ఇక‌పోతే అమ‌లా పాల్‌ 2014లో త‌మిళ ద‌ర్శ‌క‌నిర్మాత ఏఎల్ విజ‌య్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఆమె, అతను వీడిపోయారు. విడిపోవ‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యం తీసుకుని.... 2017లో విడాకులు తీసుకున్నారు. ఇక వీరి విడాకుల తర్వాత అమలా పాల్ ఒంటరిగా లైఫ్ ను గడిపింది. ఇక వెకెషన్లకు వెళ్తూ.. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ఇస్తూ నెటిజన్స్ కు దగ్గరగా ఉంది.

Ram Charan Heroine Amala Paul Marries Jagat Desai at Kochi Photos Viral in Social Media

ఇక ఈ నేపథ్యంలో జగత్ దేశాయ్ తో ప్రేమలో పడిపోయి... ఆయన్నీ పెళ్లాడింది. ఇక ఈ భామ సెకండ్ లైఫ్ ను స్టార్ట్ చేసేసింది. అయితే విచిత్రం ఏంటంటే.. ప్రపోజల్ పెట్టి 10 రోజులు కాలేదు.. అప్పుడే పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ మధ్య బాత్ టవల్ కట్టుకుని దిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ కూడా నెట్టింట షేక్ చేశాయి. ఇక మొత్తానికి అమలా పాల్ కొత్త జీవితం ప్రారంభిస్తుండగా.. ఆమెకు ఫిల్మీ బీట్ తెలుగు విషెష్ చెప్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X