Kiara Advani గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. ఈ ఫొటోసే ప్రూఫ్ మీరు గమనించారా?
సినీ ఇండస్ట్రీలో గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఎప్పుడూ వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు పెళ్లిల్లు, ప్రెగ్నెంట్ అండ్ డెలివరీ, డివొర్స్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే గతేడాది పెళ్లి చేసుకున్న రామ్ చరణ్‌తో నటించిన ఓ స్టార్ హీరోయిన్ తాజాగా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది తెలుసుకుంటున్న అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆమె ఫొటోలను నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అభిమానులు ఏమంటున్నారు? వంటి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
వసుమతి, వసుమతి అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబునే తన వెంట తిరిగేలా చేసిన అందం కియారా అడ్వాణీ. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ తన తొలి సినిమాతోనే ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. ఈ చిత్రంలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనదైన అందం, అభినయంతో కనిపించి ఆకట్టుకుంది. ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది.

ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామ సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇక్కడ అవకాశాలు అంతగా రాలేదు. అనంతరం ఆమె బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి పలు హిట్ సినిమాల్లో నటిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది.
అలా ఆమె చేసిన చిత్రాలన్ని సక్సెస్ సాధించడం వల్ల బాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఆమె నాజూకు అందానికి నార్త్ ఆడియెన్స్ కూడా ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఆన్‌స్క్రీన్‌లో తాను రొమాన్స్ చేసిన హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నిజంగానే ప్రేమలో పడి గతేడాది పెళ్లి చేసుకుందామె. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ప్రస్తుతం తల్లి కాబోతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ మధ్య చాలా సార్లు ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాలేదు.
అయితే ఇప్పుడు ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అన్న వార్తలు వస్తున్నాయి. అందుకు కావాల్సిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తోంది. కియారా అద్వాని రీసెంట్గా పెట్టిన పోస్ట్‌లను చూపించి అందులో ఆమె చాలా లావుగా ఉందంటూ రాసుకొచ్చింది. కియారా చేసిన మరో వీడియో పోస్ట్‌లో వదులుగా ఉండే సల్వార్ డ్రెస్ వేసుకుని చాలా నెమ్మదిగా నడుస్తుందని చెప్పుకొస్తోంది. దీన్ని బట్టి ఆమె ప్రెగ్నెంట్ అయిందంటూ బాలీవుడ్ మీడియా కథనాలను అల్లేస్తోంది. ఏదేమైనా ఇలాంటి విషయాలు దాచినా దాగేది కాదు. కచ్చితంగా త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే కియారా ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పొలిటికల్ యాక్షన్ డ్రామా చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











