HBD Ram Charan: ఆస్తుల్లో రామ్ చరణ్ గేమ్‌ఛేంజర్.. మెగా పవర్ స్టార్ సంపద ఎన్ని వేల కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి డ్యాన్స్‌లు, ఫైట్స్, నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా, గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ సంపాదించుకున్నారు రామ్ చరణ్ తేజ్. త్వరలో పెద్దితో ప్రేక్షకులను పలకరించబోతున్నారు చెర్రీ. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్, వ్యక్తిగత విషయాలు, ఆస్తులు, రెమ్యునరేషన్ తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులకు రెండో సంతానంగా మార్చి 27, 1985న చెన్నైలో జన్మించారు రామ్ చరణ్. మద్రాస్‌లోని పద్మశేషాద్రి బాల భవన్‌, లారెన్స్ స్కూల్ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజీలో చరణ్ విద్యాభ్యాసం జరిగింది. చదువు తర్వాత తండ్రి అడుగుజాడల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు చెర్రీ. దీనికి ముందే నటనకు సంబంధించిన అన్ని అంశాల్లో రాటుదేలాలని నిర్ణయించున్నారు. ముంబైలోని ఫేమస్ గురు.. కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దారు చరణ్. అప్పటికే కొడుకుని లాంచ్ చేయడం కోసం పలు స్క్రిప్ట్‌లు పరిశీలించి, దర్శకుల ఎంపికపై కసరత్తు చేశారు మెగాస్టార్.

Ram Charan Net Worth Career Assets Remuneration amp amp Interesting Facts About the Mega Power Star

చివరికి తనకు అత్యంత సన్నిహితుడు, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మాణంలో పూరీ జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన చిరుత చిత్రం ద్వారా 2007లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. తొలి సినిమాతోనే నటన, డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో మంచి మార్కులు సంపాదించారు. ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో స్టార్‌డమ్ అందుకోవడంతో పాటు తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు చరణ్.

అనంతరం ఆరెంజ్, రచ్చ, నాయక్, జంజీర్, ఏవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ, ధ్రువ, వినయ విధేయ రామ, ఆచార్య చిత్రాలలో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం చరణ్‌లోని మరో కోణాన్ని బయటికి తీసుకొచ్చింది. ఇక తెలుగు చిత్ర సీమను శాసించే నందమూరి - కొణిదెల కుటుంబాల వారసులు ఎన్టీఆర్- రామ్ చరణ్‌లను హీరోలుగా పెట్టి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. చరణ్‌ను గ్లోబల్ స్టార్‌ను చేసింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌తో పాటు మరెన్నో పురస్కారాలు అందుకుని తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మరింత పెంచింది. గతేడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రం.

అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సీ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని ప్రేమించి పెద్దల అంగీకారంతో 2012లో ఆమెను పెళ్లాడారు రామ్ చరణ్. ఈ దంపతులకు తొలుత క్లీంకార ఆనే ఆడపిల్ల జన్మించింది. గతేడాది ఉపాసన మరోసారి గర్భం దాల్చగా.. ఈ ఏడాది జనవరి 31న ఆమె కవల బాబు, పాపలకు జన్మనిచ్చారు. వీరికి కొణిదెల శివరామ్, అన్వీరా దేవి అని నామకరణం చేశారు. ఈ పిల్లల రాకతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ .. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాల ద్వారా భారీగా ఆదాయాన్ని అందుకుంటున్నారు. పెద్ది సినిమాకు 100 కోట్ల పారితోషికం తీసుకున్న రామ్ చరణ్.. బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌ ప్రమోషన్ కోసం ఒక్కో యూనిట్‌కు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. ఆయనకు పలు వ్యాపారాలతో పాటు ట్రూజెట్ అనే సొంత ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉంది. అలాగే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో పలు చిత్రాలను సైతం చరణ్ నిర్మించారు.

రామ్ చరణ్‌కు హైదరాబాద్‌, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల ఖరీదైన ఆస్తులున్నాయని టాలీవుడ్ టాక్. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన ఇల్లు ఉంది. అత్యంత అదునాతన సౌకర్యాలున్న ఆ ఇంటి విలువ 50 కోట్ల రూపాయల పైమాటే. దీనితో పాటు ముంబైలో ఓ పెంట్ హౌస్ కూడా ఉంది. ఇక చరణ్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, పెరారీ లాంటి కార్లు ఉన్నాయి.

అలా మొత్తంగా రామ్ చరణ్ సంపద 1380 కోట్ల రూపాయల నుంచి 1500 కోట్ల రూపాయల పైమాటే. తన సతీమణి ఉపాసన ఆస్తులను కూడా కలిపితే దీని విలువ 3000 కోట్ల రూపాయల నుంచి 3500 కోట్ల పైమాటేనని అంచనా. స్టార్‌డమ్‌తో పాటు సామాజిక సేవలోనూ తాను తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నారు రామ్ చరణ్. తన సంపాదనలో కొత్త మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు చరణ్. ఆయన జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.

Read more about: ram charan chiranjeevi upasana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X