ఇంతకీ ఆమె ఎవరు ? బిగ్‌బాస్ మాధురి‌పై పెద్ది హీరోయిన్ ఫైర్!

దివ్వెల మాధురి(Divvela Madhuri) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9)లో వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ, హౌస్లో ఉన్న కేవలం రెండు వారాలే అయినా.. తన మార్క్ చూపించింది. ఇటీవల తిరుమల శ్రీవారి కొండపై దివ్వెల మాధురి.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నర్ తనూజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, చిక్కుల్లో పడింది. ఈ క్రమంలో దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలుపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు సమస్య ఏంటీ?

తిరుమలలో కేక్ కట్ ఘటన
ఇటీవల తిరుమల శ్రీవారి కొండపై దివ్వెల మాధురి.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నర్ తనూజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. కేక్ కట్ చేసిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. కొండ పై బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం వివాదానికి దారితీసింది. పవిత్రమైన తిరుమలలో కేక్ కటింగ్ తో బర్త్ డే సెలబ్రేషన్లు చేసుకోవడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీంతో బిగ్ బాస్ తనూజ, దివ్వెల మాధురి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది వారికి వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Ram Charan s Peddi Heroine Janhvi Kapoor Slams Bigg Boss Divvela Madhuri in Tirumala Row

ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో మాధురిపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. అనేక మంది భక్తులు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన మాధురి దివ్వెల తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాము తీసుకెళ్లింది ఎగ్‌లెస్ కేక్ అని, తిరుమల పవిత్రతకు ఎలాంటి భంగం కలిగించలేదని చెప్పారు.ఈ సమయంలో గతంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తిరుమల కొండపై కేక్ కట్ చేశారని ఆరోపించారు. 'అప్పుడు ఎవరూ స్పందించలేదు. కానీ నేను చేస్తే మాత్రం ఇంత పెద్ద సంచలనం చేస్తున్నారు ఎందుకు?' అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీశాయి.

జాన్వీ కపూర్ ఘాటు స్పందన
బిగ్ బాస్ మాధురి చేసిన ఆరోపణలు జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లడంతో ఆ హీరోయిన్ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. మాధురి ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ 'అసలు ఎవరు ఈ మహిళ?'అంటూ ప్రశ్నించినట్లు ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఇతరులపై అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదని ఆ పోస్టులో పేర్కొనబడింది. అలాగే తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రత గురించి కూడా వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది.

అయితే ఈ ట్వీట్ జాన్వీ కపూర్ అఫిషియల్‌ అకౌంట్ నుంచి కాకుండా ఫ్యాన్ ఫేజీ నుంచి పోస్ట్ అయింది. దీంతో ఇది జాన్వీ కపూర్ రియాక్షన్ ఆమెది కాదని తెలుస్తోంది. అయితే ఈ ట్వీట్ మాత్రం మాధురికి జాన్వీకపూర్ కౌంటర్ అంటూ సోషల్‌మీడియా తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వివాదానికి మరో మలుపు తిరిగింది. వాస్తవానికి ఈ విషయంపై జాన్వీ కపూర్ స్వయంగా స్పందించారని చాలా మంది భావించారు. ఈ క్రమంలో హీరోయిన్ కు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన చోట నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, ఇతరులపై ఆరోపణలు చేయడంపై సరికాదని దివ్వెల మాధురిపై కామెంట్స్ తో విరుచుకపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్‌కు తిరుమల వేంకటేశ్వరస్వామిపై అపారమైన భక్తి ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ తరచుగా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కాలినడకన కొండెక్కి దర్శనం చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జాన్వీ కపూర్ కెరీర్ విషయాన్ని వస్తే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 30న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X