త్రిప్తి డిమ్రీపై రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్.. ఏమన్నారంటే?
యానిమల్ చిత్రంతో ఇండియాను షేక్ చేసింది త్రిప్తి డిమ్రీ. డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకొని ఓవర్ నైట్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఏకంగా రష్మిక మందన్నను వెనక్కి లాగేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఆ సినిమా తర్వాత త్రిప్తి డిమ్రీకి బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమా ఆఫర్లు అందుకుంది. ఇదే క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సందీప్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
త్రిప్తి డిమ్రీ ఫిల్మ్ కెరీయర్..
న్యూ ఢిల్లీకి చెందిన యంగ్ అండ్ స్టార్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ 2017 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. హిందీ చిత్రాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. సైకాలజీ చదువుకున్న ఈ ముద్దుగుమ్మ యాక్టిగ్ లోనూ పట్టా పొందింది. అలనాటి నటి శ్రీదేవి నటించిన 'మామ్' అనే చిత్రంలో మొదటి సారిగా త్రిప్తి డిమ్రీ నటించింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, క్వాలా వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన 'యానిమల్'లో జోయా పాత్రలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది.

వరుస పెట్టి ఆఫర్లు..
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన నటించిన తర్వాత త్రిప్తి డిమ్రీకి బాలీవుడ్ లో వరుస పెట్టి ఆఫర్లు అందుతున్నాయి. యానిమల్ తర్వాత 'బ్యాడ్ న్యూజ్', 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో', 'భూల్ భులయ్యా 3' వంటి సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ధడక్ 2 చిత్రంలో అవకాశం దక్కించుకుంది. 2018లో వచ్చిన చిత్రానికి ఇది సీక్వెల్. అర్జున్ ఉత్సర వంటి చిత్రంలోనూ అవకాశం అందుకుంది. వీటితో పాటు తాజాగా త్రిప్తి డిమ్రీ పేరును మరిన్ని ప్రాజెక్ట్స్ కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ కు జోడీగా.. ఆర్జీవీనే షాక్ అయ్యేలా..
సందీప్ రెడ్డి వంగ - ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సందీప్ మూవీ కాస్ట్ అండ్ క్రూను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా త్రిప్తి డిమ్రీని స్పిరిట్ హీరోయిన్ గా ఫైనల్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా త్రిప్తిని ఎంపిక చేయడం పట్ల రామ్ గోపాల్ వర్మ ఆశ్చర్య పోయారు.
రామ్ గోపాల్ వర్మ ఎగ్జైట్ మెంట్..
త్రిప్తి డిమ్రీని సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' హీరోయిన్ గా ఫైనల్ చేయడంతో రామ్ గోపాల్ వర్మ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. స్పిరిట్ చిత్రం తర్వాత బాలీవుడ్ లోనే త్రిప్తి డిమ్రీ బిగ్ థింగ్ గా మారబోతోందని, అక్కడి ఇండస్ట్రీని ఏలబోతోందని కామెంట్ చేశారు. యానిమల్ తర్వాత మళ్లీ ఆమెను తీసుకోవడం పట్ల సందీప్ నూ అభినందించారు. జోయాగా త్రిప్తి ఇచ్చిన పెర్ఫామెన్స్ ను గుర్తు చేస్తూ ఆమె మంచి భవిష్యత్ ఉందని ప్రత్యేకంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.


Click it and Unblock the Notifications











