బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే దేశమే గుర్తించే స్థాయికి ఎదిగాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తన చిత్రాలతో టాలీవుడ్ దర్శకులు పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసిన ఆయన.. ఎన్నో రకాల జోనర్లలో అదిరిపోయే సినిమాలు చేశాడు. అలాగే, బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అలా మంచి పేరు సంపాదించాడు. కానీ, కొంత కాలంగా ఆర్జీవీ తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. అదే సమయంలో వ్యక్తిత్వ పరంగానూ భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఎక్కువగా హీరోయిన్లతో కలిసి సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వర్మ హీరోయిన్ హాట్ వీడియోను షేర్ చేశాడు. దానిపై మీరూ లుక్కేయండి మరి!

కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్‌గా
విభిన్నమైన చిత్రాలతో చాలా జోనర్లలో సినిమాలు చేసి.. టాలీవుడ్‌లోనే దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తున్నాడు. తద్వారా వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో ఎన్నో అంశాలపై ట్వీట్లు చేస్తూ కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూనే ఉన్నాడు.

పొలిటికల్ మూవీలతో రచ్చ
రాంగోపాల్ వర్మ తన కెరీర్‌లో ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ రేంజ్‌కు కూడా చేరుకున్నాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', ‘పవర్ స్టార్' వంటివి చేశాడు.

అడల్ట్ కంటెంట్‌తోనూ చేస్తూ
గతంలో డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య అడల్ట్ కంటెంట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ సంచలన దర్శకుడు ఇప్పటికే ‘జీఎస్టీ', ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘డేంజరస్', ‘లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ద్వారా వదిలాడు.

అమ్మాయిలతో తెగ సందడి
సినిమాల పరంగానే కాదు.. తన వ్యవహార శైలితోనూ రాంగోపాల్ వర్మ తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొందరు అమ్మాయిల (హీరోయిన్లు)తో కలిసి రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ వంటి వారితో ఆర్జీవీ తరచూ పార్టీలు చేసుకుంటుంటాడు. అలాగే, అషు రెడ్డి, ఆరియానాతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు.

అక్కడ వర్మ యమ యాక్టివ్
సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నాడు.

హీరోయిన్ బెడ్ వీడియోతో
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి పరిచయమైన వారిలో అప్సరా రాణి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బెడ్‌పై హాట్‌గా ఉన్న ఓ వీడియోను షేర్ చేసింది. దీన్ని తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
Recommended Video


నీ గురించే ఆలోచన అంటూ
అప్సరా రాణి ట్వీట్ చేసిన వీడియోలో ఆమె బెడ్‌పై చిన్న క్లాత్ మాత్రమే చుట్టుకుని డిఫరెంట్‌గా ఫోజులిస్తూ కనిపించింది. దీనికామె ‘నీ గురించే ఆలోచిస్తున్నా' అంటూ క్యాప్షన్ పెట్టింది. దాన్ని రీట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ ‘మేము కూడా నీ గురించే ఆలోచిస్తున్నాం' అంటూ రాసుకొచ్చాడు. మొత్తానికి ఈ సంచలన దర్శకుడు చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











