శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!
రాంగోపాల్ వర్మ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సంచలన దర్శకుడు వివాదాలతో సహవాసం చేస్తూ చాలా కాలంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాడు. తద్వారా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఆరంభంలోనే ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించి తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్న ఆయన.. ఈ మధ్య పూర్తిగా గాడి తప్పిపోయాడు. ఇందులో భాగంగానే కొంత కాలంగా చిత్ర విచిత్రమైన సినిమాలు రూపొందిస్తూ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంటున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్జీవీ శృంగార వీడియోలను షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం వాటిపై మీరూ లుక్కేయండి!

వివాదాలకు చిరునామాగా వర్మ
కెరీర్ మొదట్లో విభిన్నమైన చిత్రాలతో చాలా జోనర్లలో సినిమాలు చేసి.. రాంగోపాల్ వర్మ దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని కాంట్రవర్శీ కథలను ఎంచుకుంటున్నాడు. తద్వారా నిత్యం వివాదాల్లోనే చిక్కుకుంటున్నాడు. అలాగే ఎన్నో అంశాలపై ట్వీట్లు చేస్తూ గొడవల్లో భాగమవుతున్నాడు. దీంతో వర్మ సంచలనం అవుతున్నాడు.
బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!
https://telugu.filmibeat.com/heroine/bigg-boss-fame-divi-vadthya-gorgeous-photos-viral-108536.html

రాజకీయ సినిమాలతో వివాదం
సుదీర్ఘమైన కెరీర్‌లో రాంగోపాల్ వర్మ ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న కథాంశాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్' వంటి సినిమాలు రూపొందించాడు.

బీ గ్రేడ్ సినిమాలు చేస్తూ రచ్చ
రకరకాల జోనర్లలో డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య అడల్ట్ కంటెంట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ సంచలన దర్శకుడు ఇప్పటికే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ద్వారా విడుదల చేశాడు.

అమ్మాయిల శృంగార సినిమా
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం 'డేంజరస్' అనే సినిమాను తీశాడు. ఇందులో నైనా గంగూలీ, అప్సరా రాణి హీరోయిన్లుగా చేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య శృంగార నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

అందులో వర్మ యమ యాక్టివ్
రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నాడు.

హీరోయిన్ల శృంగార వీడియోతో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాంగోపాల్ వర్మ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని శృంగార వీడియోలను షేర్ చేశాడు. అవి త్వరలోనే విడుదల కాబోతున్న 'డేంజరస్' మూవీలోని సన్నివేశాలని చూస్తే అర్థం అవుతోంది. ఇందులో నైనా గంగూలీ, అప్సరా రాణి రెచ్చిపోయి మరీ నటించారు. మరీ ముఖ్యంగా ముద్దులు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసేశారు.

డైరెక్టుగా పోర్న్ తీసేశావంటూ
రాంగోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి. ఇక, ఈ వీడియోలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అందులో చాలా మంది 'వర్మ నేరుగా పోర్న్ సినిమానే తీసినట్లున్నాడు' అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











