రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్'.. రాజమాత సంచలన నిర్ణయం!

ఒకప్పుడు సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌ రమ్యకృష్ణ (Ramya Krishnan). 'నరసింహ'లో నీలాంబరిగా, 'బాహుబలి'లో శివగామిగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది రమ్యకృష్ణ. ఎన్నో పవర్‌ఫుల్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించబోతున్నారట. మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఆ సంగతేంటీ?

ప్రస్తుతం డిజిటల్ కంటెంట్‌కు భారీ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో స్టార్ నటీనటులు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో వెబ్ సిరీస్‌లు,డిజిటల్ షోలు ఎక్కువగా యువ నటీనటులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల ఆదరణ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేందుకు స్టార్ నటులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ 'సెకండ్ లవ్' అనే డేటింగ్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారట.

Ramya Krishnan Enters OTT as Love Guru Hosts Second Love Dating Reality Show

ఈ షో పేరు విన్నప్పుడే ఇది ప్రేమకు సంబంధించిన కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. అయితే ఇది సాధారణ డేటింగ్ షో కాదు. ప్రేమలో విఫలమైన, బ్రేకప్ అనుభవించిన 30 ఏళ్లలోపు 12 మంది యువతీయువకులను ఒక లగ్జరీ విల్లాలో ఉంచి, వారికి మరోసారి ప్రేమను వెతుక్కునే అవకాశం కల్పించడం ఈ షో ప్రధాన ఉద్దేశమని టాక్. గతంలోని బాధలను దాటి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వారికి సహకరించే ప్రయత్నమే 'సెకండ్ లవ్' షో కాన్సెప్ట్‌గా కనిపిస్తోంది.ఈ కాన్సెప్ట్‌ ను జెన్-జీ ప్రేక్షకులకు ద్రుష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

శివగామి నుంచి లవ్ గురుగా
ఇప్పటివరకు రమ్యకృష్ణను ప్రేక్షకులు ఎక్కువగా పవర్‌ఫుల్, డామినేటింగ్ పాత్రల్లోనే చూశారు. అయితే ఈ షోలో ఆమె పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండనుంది.ప్రేమలో విఫలమైన యువతకు మార్గదర్శకురాలిగా, వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే వ్యక్తిగా, అవసరమైన చోట సలహాలు ఇచ్చే హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ షోకు సంబంధించిన పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్టర్‌లో పగిలిపోయిన హార్ట్ సింబల్‌ను తిరిగి అతికిస్తున్నట్లుగా రమ్యకృష్ణ కనిపించడం షో కాన్సెప్ట్‌ను ప్రతిబింబిస్తోంది.అందుకే సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు "రాజమాతే కాదు... ఇప్పుడు లవ్ గురువు కూడా" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొత్త వ్యూహం ఇదేనా?
ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ప్రాంతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు కొత్త తరహా రియాలిటీ షోలపై దృష్టి పెడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు రియాలిటీ కంటెంట్‌కు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే నాగార్జున 'బిగ్ బాస్', నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' వంటి షోలతో సూపర్ హిట్లు అందించారు. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా అదే బాటలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం.

ప్రస్తుతం 'సెకండ్ లవ్'కు సంబంధించిన అధికారిక ప్రకటన తమిళ జియో హాట్‌స్టార్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాత్రమే కనిపించింది. దీంతో ఈ షో తమిళంలోనే పరిమితం అవుతుందా? లేక తెలుగులో కూడా డబ్ లేదా ప్రత్యేక వెర్షన్‌గా వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. రమ్యకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానగణాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తెలుగులో కూడా ఈ షోను అందించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Read more about: jio cinema ramya krishnan ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X