చేతిలో ప్లేట్ పెట్టి.. ఆ డైరెక్టర్ అందరి ముందే .. ఏడుస్తూ వెళ్లిపోయిన రమ్యకృష్ణ

రమ్యకృష్ణ.. ఈమె గురించి తెలియని వారు ఉండరు. గ్లామర్ రోల్స్‌తో పాటు లేడి ఓరియెంటెడ్, పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు రమ్యకృష్ణ. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అన్ని రకాల పాత్రలు పోషించగల అరుదైన నటీమణుల్లో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఇప్పటికీ దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారు. అలాంటి రమ్యకృష్ణని ఓ స్టార్ డైరెక్టర్ సెట్‌లోనే ఏడిపించారట. ఈ వివరాల్లోకి వెళితే..

ramya krishnan gets emotional during aahwanam shooting here is the why

14 ఏళ్లకే హీరోయిన్‌గా

15 సెప్టెంబర్ 1970న చెన్నైలో జన్మించారు రమ్యకృష్ణ. 14 ఏళ్ల వయసులోనే కంచు కాగడా చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె అనంతరం చక్రవర్తి, సంకీర్తన, మదన గోపాలుడు, బావ మరదళ్ల సవాల్ వంటి చిత్రాల్లో నటించారు. తొలినాళ్లలో నటన రాదంటూ విమర్శలు ఎదుర్కొన్న రమ్యకృష్ణ అన్ని విమర్శలను ఎదుర్కొని రాటుదేలారు. ఈ దశలో కళాతపస్వి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.

దక్షిణాదిని ఊపేసిన అందం

తర్వాత ఇద్దరు ఇద్దరే, అల్లుడుగారు, అల్లరి మొగుడు, బంగారు బుల్లోడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు, క్రిమినల్, హాలో బ్రదర్, ముద్దుల ప్రియుడు, ముగ్గురు మొనగాళ్లు, అమ్మోరు, అల్లుడా మజాకా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందల సినిమాల్లో నటించారు రమ్యకృష్ణ. 90వ దశకంలో దక్షిణాదిని తన అందం, నటనతో అలరించారు .

అమ్మవారి పాత్రలకు కేరాఫ్‌గా

ఇక భక్తిరస చిత్రాలకు, దేవతల పాత్రలతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టారు రమ్యకృష్ణ. అమ్మోరు, దేవుళ్లు వంటి సినిమాల్లో అమ్మవారిగా నటించారు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో రజనీని డామినేట్ చేసే రోల్‌లో నటించారు. ఆ సినిమాలో ఏకంగా రజనీపై కాళ్లు పెట్టే సన్నివేశంతో తమిళనాడు రగిలిపోయింది. స్వయంగా రజనీ కలగజేసుకోవడంతో నాటి వివాదం సద్దుమణిగింది.

కృష్ణవంశీతో ఏడాడుగులు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ మధ్యలో కాస్త స్లో అయినా తిరిగి గాడిలో పడ్డారు. ముఖ్యంగా బాహుబలిలో శివగామిగా మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఆమె హావభావాలు, డైలాగ్స్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అనంతరం సోగ్గాడే చిన్నినాయన, రిపబ్లిక్, లైగర్, బంగర్రాజు, రంగమార్తాండ, గుంటూరు కారం, జైలర్ చిత్రాలలో రమ్యకృష్ణ నటించారు. 2024లో చివరిసారిగా పురుషోత్తముడు సినిమాలో కనిపించిన ఆమె మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఆహ్వానంలో అద్భుత నటన

40 ఏళ్ల కెరీర్‌లో ఎందరో దర్శకులతో పనిచేసిన రమ్యకృష్ణకు ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. వాటిలో ఆహ్వానం కూడా ఒకటి. కట్నం పిచ్చితో ఉండే భర్తను మార్చుకునే ఇల్లాలి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆహ్వానం సినిమా సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు.

ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిన రమ్యకృష్ణ

తాను నటీనటులను గౌరవిస్తానని, షూటింగ్ చివరి రోజున రమ్యకృష్ణ ఇంటికి వెళ్తుండగా వెండి పళ్లెంలో పట్టుబట్టలు, 10 వేల రూపాయల నగదు, పసుపు కుంకుమ పెట్టి గౌరవంగా పంపించామని కృష్ణారెడ్డి తెలిపారు. దాంతో రమ్యకృష్ణ తన చేయి పట్టుకుని ఏడ్చేశారని.. ఏడుస్తూనే ఇంటికి వెళ్లారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: ramya krishnan sv krishna reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X