Ramya Krishnan: బికినీలో రమ్యకృష్ణ.. వైరల్ అవుతున్న ఫొటో.. అంటే అది, అప్పట్లో..

రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె అందం, అభినయం, నటనను ప్రేక్షకులు ఇప్పుడు అప్పుుడే మరిచిపోలేరు. ఎందుకంటే ఆమె ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకే హైప్​ తీసుకొస్తుంది. నీలాంబరిగా ద్వేషం చూపించిన, శివగామిగా రాజ్యాన్ని పాలించిన, దేవతగా అవతారం ఎత్తినా, గ్లామర్​ లుక్​లో అందాలు ప్రదర్శించిన.. ఇలా ఎందులోనైనా లుక్స్​తో, నటనతో అదరగొట్టడం ఒక రమ్యకృష్ణకే చెల్లింది. ప్రస్తుతం మంచి ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న రమ్యకృష్ణకు సంబంధించిన కొన్ని ఓల్డ్​ పిక్స్​ నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

 అగ్ర హీరోల సరసన..

అగ్ర హీరోల సరసన..

ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి స్టార్​ హీరోయిన్​గా వెలుగొందిన రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ బాటలో పయనిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన ఆమె బంగార్రాజు, రొమాంటిక్​ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

 మరోసారి తల్లి పాత్రలో..

మరోసారి తల్లి పాత్రలో..

తాజాగా టాలీవుడ్ డేరింగ్​ అండ్ డ్యాషింగ్​ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్​లో రౌడీ హీరో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మూవీ లైగర్​. ఇందులో హీరోకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించిందన్న విషయం తెలిసిందే.

మారుమోగిన డైలాగ్​లు..

మారుమోగిన డైలాగ్​లు..

లైగర్​ ట్రైలర్​ చూస్తే తెలిసిపోతుంది రమ్యకృష్ణ ఈ సినిమాలో ఎలాంటి రోల్​ ప్లే చేసిందని. ట్రైలర్​లో ఆమె చెప్పిన డైలాగ్​లు మారుమోగాయి. ఇక గురువారం అంటే ఆగస్టు 25న విడుదలైన లైగర్​ చిత్రంలో రమ్యకృష్ణ సర్​ప్రైజ్ ప్యాకెజ్​ అని ప్రముఖ అనలిటిక్​ ఉమర్​ సంధు తెలిపాడు.

 ఆయన చిత్రాలకు కేరాఫ్​గా..

ఆయన చిత్రాలకు కేరాఫ్​గా..

ఇదిలా ఉంటే ఇంతకుమందు ఆమె దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్​గా నిలిచింది రమ్యకృష్ణ. ఆయన దర్శకత్వంలో అనేక సూపర్​ హిట్​ సినిమాల్లో హీరోయిన్​గా అలరించింది. అప్పుడు యూత్ గుండెల్లో గుబులు పుట్టించింది బ్యూటిఫుల్​ హీరోయిన్​ రమ్యకృష్ణ.

హాట్​ అందాలతో..

హాట్​ అందాలతో..

90లలో వచ్చిన సినిమాల్లో తన హాట్ హాట్​ అందాలతో ఒక ఊపు ఊపేసింది రమ్యకృష్ణ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కమల్​ హాసన్​​ వంటి అగ్రతారలతో జోడి కట్టి వారికి దీటుగా ఆడిపాడింది. ఇక రాఘవేంద్ర రావు, దివంగత దర్శకుడు ఈవీఎస్​ సత్యనారాయణ, కృష్ణవంశీ సినిమాల్లో ఆమె చూపించిన గ్లామర్​ అంతా ఇంతా కాదు.

జయలలిత పాత్రలో..

జయలలిత పాత్రలో..

అనంతరం తల్లి, వదిన వంటి తదితర పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీన్​ వెబ్​ సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించి అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఎవర్​ గ్రీన్​ హీరోయిన్​గా..

ఎవర్​ గ్రీన్​ హీరోయిన్​గా..

తాజాగా లైగర్​తో ముందుకు వచ్చిన రమ్యకృష్ణ ఆమె భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండలో నటిస్తోంది. ఈ మూవీ నట సామ్రాట్​ అనే ఓ మరాఠి మూవీకి రీమేక్​గా వస్తోందని సమాచారం. అలాగే పలు టీవీ షోలలో అప్పుడప్పుడు మెరుస్తూ ఎవర్​ గ్రీన్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంటోంది రమ్యకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X