Ramya Krishnan: బికినీలో రమ్యకృష్ణ అరాచకం.. తడిచిన బాడీతో ఘాటుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు మాత్రమే తమదైన ముద్రను వేసుకుని.. సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్లుగా హవాను చూపించారు. అందులో రమ్యకృష్ణ ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంటరైన ఆమె.. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు కూడా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్నారు. ఇక, ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె బికినీ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. అది మీరే చూడండి!

దేశ వ్యాప్తంగా గుర్తింపు
'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఎంటరయ్యారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' అనే సినిమాతో తెలుగులోకి పరిచయమయ్యారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి ఆమె స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించారు. ఈ క్రమంలోనే ఎన్నో భాషల్లో వరుసగా సినిమాలు చేశారు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు.

బాహుబలితో మరింత
సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ వస్తోన్న రమ్యకృష్ణ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోన్నారు. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌తోనూ తెగ మెప్పిస్తున్నారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా మరోసారి ఆమె నేషనల్ వైడ్‌గా హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ భామ పాన్ ఇండియా చిత్రాల్లో భాగం అవుతూ తన సత్తాను చాటుకుంటూనే ఉన్నారు.

బిగ్ షాక్.. భర్తతో కలిసి
xరమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల్లో భాగం అవుతున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అలాగే, ఇప్పుడు మాత్రం ఆమె 'రంగమార్తాండ' అనే సినిమాలో నటిస్తున్నారు. దీన్ని ఆమె భర్త డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇది ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కాబోతుంది.

టీవీ షోలు, సినిమాలు
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రమ్యకృష్ణ.. ఇటీవలే ఆహాలో స్ట్రీమింగ్ అయిన 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. ఇందులో ఆమె తనదైన రీతిలో ఆకట్టుకున్నారు. ఇక, ఇప్పుడు రమ్యకృష్ణ.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న 'జైలర్' మూవీలో నటిస్తోన్నారు. అలాగే, తెలుగు, తమిళం, మలయాళంలోనూ కొన్నింటిలో నటిస్తోన్నారు.

అందులో యమ బిజీ
దాదాపు నాలుగు దశాబ్దాలుగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో కొంత వేగం తగ్గించిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటున్నారు.

గ్లామర్ షో చేస్తోందిగా
సోషల్ మీడియా వాడకం పెరిగినా.. సీనియర్ హీరోయిన్లు అందులో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, రమ్యకృష్ణ మాత్రం ఓ రేంజ్‌లో హడావిడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటారు. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవి కూడా వదులుతున్నారు. దీంతో రమ్యకృష్ణ పేరు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

బికినీలో రమ్యకృష్ణ షో
సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ.. అప్పట్లో గ్లామరస్ రోల్స్ కూడా చేశారు. ఆ సమయంలోనే ఓ సందర్బంలో ఆమె బికినీతో కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో రమ్యకృష్ణ యంగ్ ఏజ్‌లో కనిపించడంతో పాటు అందాలను ఆరబోస్తున్నారు. దీంతో ఆమె ఇప్పుడు హైలైట్ అవుతోన్నారు.


Click it and Unblock the Notifications











