For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ స్టార్ హీరోతో భయానక అనుభవం.. నాలుగో నెల కడుపుతోనే: రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

  |

  రమ్యకృష్ణ.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఆమె సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. మన దగ్గరే కాదు.. దక్షిణాదిలోనూ ఈమె ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు. ఇక, ఇటీవలి కాలంలో తన సెకెండ్ ఇన్నింగ్స్‌తో సందడి చేస్తోన్న రమ్యకృష్ణ.. ఇప్పటికీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో రమ్యకృష్ణ తన జీవితంలో జరిగిన ఓ భయానక అనుభవం గురించి బయట పెట్టారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  అలా వచ్చి.. నేషనల్ రేంజ్ క్రేజ్

  అలా వచ్చి.. నేషనల్ రేంజ్ క్రేజ్

  సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న రమ్యకృష్ణ ముందుగా 'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. సౌత్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని హవా చూపారు.

  The Ghost Twitter Review: విక్రమ్ తర్వాత ది ఘోస్ట్.. ఆ ట్విస్ట్‌కు మెంటలే.. ఓవరాల్ టాక్ ఏంటంటే!

  బాహుబలితో మరోసారి దూకుడు

  బాహుబలితో మరోసారి దూకుడు

  ఎంతో కాలంగా తెలుగులో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ వచ్చిన రమ్యకృష్ణ.. చాలా భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రచ్చ చేస్తున్నారు. ఫలితంగా సుదీర్ఘ కాలంగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా మరోసారి ఆమె దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి మరింత దూకుడుగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నారు.

  రమ్యకృష్ణకు షాక్ ఇచ్చిన లైగర్

  రమ్యకృష్ణకు షాక్ ఇచ్చిన లైగర్

  ఏజ్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. ఇటీవలే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన 'లైగర్' మూవీలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుని పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. దీంతో రమ్యకృష్ణ ఢీలా పడ్డారు.

  GodFather Twitter Review మెగాస్టార్ కమ్ బ్యాక్.. గాడ్‌ఫాదర్ బ్లాక్‌బస్టర్ అంటూ

  భర్తతో ఒకటి.. అలాంటి చిత్రాలు

  భర్తతో ఒకటి.. అలాంటి చిత్రాలు

  ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగుతో పాటు చాలా భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ పూర్తైంది. దీనితో పాటు కొన్ని పాన్ ఇండియా చిత్రాల్లోనూ భాగం అయ్యారు. అలాగే, కొన్ని తెలుగు చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

  ఆ డ్యాన్స్ షోలో జడ్జ్‌గా సందడి

  ఆ డ్యాన్స్ షోలో జడ్జ్‌గా సందడి

  వరుస సినిమాలతో తీరిక లేని షెడ్యూల్ గడుపుతోన్న రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆమెతో పాటు శేఖర్ మాస్టర్ మరో జడ్జ్‌గా చేస్తున్నాడు. దీన్ని ఓంకార్ నడిపిస్తున్నాడు. ఇందులో గెలిచిన వాళ్లు నేరుగా సినిమాలో స్టార్ హీరోకు కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని అందుకోబోతున్నారు.

  స్పెషల్ సాంగ్.. సీక్రెట్ లీక్ చేసి

  ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' షోకు అదిరిపోయే స్పందన వస్తోంది. అలాగే, ఇందులో రమ్యకృష్ణ తనదైన శైలిలో జడ్జ్‌మెంట్ ఇస్తూ మెప్పిస్తున్నారు. అలాగే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మాట్లాడుతూ.. డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'సయ్యా సయ్యారే' అంటూ తాను చేసిన ఓ స్పెషల్ సాంగ్ వెనుక సీక్రెట్‌ను లీక్ చేశారు.

  ఎప్పటికీ మర్చిపోనని కామెంట్

  ఎప్పటికీ మర్చిపోనని కామెంట్

  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నా అల్లుడు' సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ల మదర్‌గా నటించారు. ఇందులో 'సయ్యా సయ్యారే' అనే పాటను చేశారు. అదే పాటకు డ్యాన్స్ ఐకాన్ షోలో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేయగా.. రమ్యకృష్ణ 'ఆ సాంగ్ చేసేటప్పుడు నేను నాలుగు నెలల ప్రెగ్నెంట్‌ను. అందుకే ఇది నాకు చాలా స్పెషల్' అని చెప్పారు. దీంతో అంతా షాక్ అయ్యారు.తారక్ లాంటి డ్యాన్సర్‌కు సమానంగా చేయడం నిజంగా ఆమెకు భయానక అనుభవం అనే చెప్పాలి.

  English summary
  Tollywood Senior Heroine Ramya Krishnan Recently Participated in Dance IKON Show. She Reveals Unforgettable Experience about Jr NTR Movie in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X