Ramya Krishna: ఆ హీరోతో నటించాలంటే భయం.. ఆ విషయంపై తొలిసారి నోరు విప్పిన రమ్యకృష్ణ

Ramya Krishnan: అలనాటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నీలాంబరిగా మారి నరసింహ పై పగ తీర్చుకోవాలని ప్రయత్నించినా.. శివగామిగా అవతారం ఎత్తి మాహిష్మతి రాజ్యాన్ని ఏలినా ఘనత రమ్యకృష్ణ కే దక్కుతుంది. ఈ అమ్మడు ఎన్నో పవర్ పుల్ రోల్స్ లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి.. రమ్యకృష్ణ ఓ స్టార్ హీరోతో నటించడానికి భయపడిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏంటీ? ఓ లూక్కేయండి.

హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె తన అందం అభినయంతో తెలుగు ఇండస్ట్రీని ఏలింది. దర్శక కేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలకు కేరాఫ్ రమ్యకృష్ణ. తన అంద చందాలతో టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రమ్యకృష్ణ. ఆమె తన అందాల ఆరబోతలో 90 కుర్రాల స్వప్న సుందరిగా మారిపోయింది. కేవలం హీరోయిన్ పాత్రలకే కాకుండా.. పవర్ ఫుల్ రూల్స్ లో కూడా నటించి మెప్పించింది ఆమె నటజీవితంలో రజనీకాంత్ హీరోగా నటించిన 'నరసింహ' సినిమాలో నీలాంబరిగా నటించి విమర్శకులు ప్రసంశలు కూడా అందుకుంది.

Ramya Krishnan scared to act with Tamil superstar Kamal Haasan In Panchathanthiram movie

రరమ్యకృష్ణ తన పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రమ్యకృష్ణ తన సత్తా చాటుతోంది. తల్లిగా .. వదినగా.. పవర్ఫుల్ ఆఫీసర్ గా.. లేదా రాజకీయ నాయకులుగా నటిస్తూ తన నట విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రధానంగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో'శివగామి' పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది రమ్యకృష్ణ. ఈ మూవీ రమ్యకృష్ణ సినీ ప్రస్థానంలో ఓ మైల్ స్టోన్ గా చెప్పవచ్చు.

ఆ తర్వాత తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన 'రంగమార్తాండ' సినిమాలో కూడా నటించి మెప్పించింది .ఆ మధ్యకాలంలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన క్వీన్ అనే వెబ్ సిరీస్ లో నటించి అదరగొట్టింది. అలాగే సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' మూవీలో రాజకీయ నాయకురాలుగా రమ్యకృష్ణ నటించిన పలువురి ప్రశంసలను పొందింది. ఇక నాచురల్ స్టార్ హీరోగా తెరకెక్కబోతున్న 'ది ప్యారడైజ్' అనే మూవీలో హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Ramya Krishnan scared to act with Tamil superstar Kamal Haasan In Panchathanthiram movie

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తుంది రమ్యకృష్ణ. అయితే తాజాగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరో సినిమాలో నటించడానికి తాను భయపడ్డానని చెప్పుకొచ్చింది. ఆ హీరో ఎవరో కాదు.. తమిళ సూపర్ స్టార్ కమలహాసన్. రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఎంతోమంది హీరోలతో కలిసి నటించాను. కానీ సూపర్ స్టార్ కమల్ హాసన్ తో నటించాలంటే మాత్రం చాలా భయపడ్డాను. అంతేకాదు.. ఆయన ముందు డైలాగ్ చెప్పాలంటే కూడా వణుకు వస్తుంది' అని పేర్కొన్నారు.

రమ్యకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. 'అలాంటిది పంచతంత్రం సినిమాలో నా మొదటి షార్ట్ కమల్ సార్ తోనే.. ఆ సినిమాలో నేను మ్యాగీ పాత్రలో నటించాను. అయితే.. ఇది ఒక అద్భుతమైన పాత్ర అని, నా పాత్రకు ప్రత్యేక ఆకర్షణ ఉండాలని కమల్ చెప్పారు. ఆ సినిమాలో కమల్ హాసన్ తో తొలిసారి నటించడానికి తొలిసారి చాలా భయపడ్డాను. కానీ, ఆ తర్వాత అంతా సెట్ అయిపోయింది' అంటూ రమ్యకృష్ణ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన వాక్యాలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నీలాంబరిని భయపెట్టిన భారతీయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ramyakrishnan kamal haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X