తెల్లారితే పెళ్లి.. అర్థరాత్రి 2 వరకు ఆ హీరోతో ఐటెం స్టెప్పులు..
సాధారణంగా పెళ్లి ముందు రోజు అంటే.. ఎవరికైనా టెన్షన్, ఎమోషన్, కుటుంబంతో గడిపే ప్రత్యేక క్షణాలు గుర్తుకొస్తాయి. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఆ రోజును కూడా తన కెరీర్‌కి అంకితం చేసింది. తెల్లారితే పెళ్లి ఉన్నా.. రాత్రంతా షూటింగ్ స్పాట్‌లోనే ఉండి, స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ తన పని పూర్తి చేసిందట. పెళ్లి కంటే ముందు ఒప్పుకున్న పని పూర్తి చేయడం ముఖ్యం అనుకుని డెడికేషన్ తో వర్క్ చేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. మరి అంతటి డెడికేషన్ గా పనిచేసిన ఆ హీరోయిన్ ఎవరు? ఆమె డ్యాన్స్ చేసిన ఆ సినిమా ఏది? ఆ ఆసక్తికర సంఘటన వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అలనాటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రమ్యకృష్ణ (Ramya Krishnan). దక్షిణ భారత సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ అగ్రనటి. ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు, మరోవైపు పవర్ పుల్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులను మెప్పించింది. తన ఆమె కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నప్పటికీ... తాజాగా బయటకు వచ్చిన ఒక సంఘటన ఆమె ప్రొఫెషనలిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

కెరీర్‌లో అద్భుత ప్రయాణం
1970లో చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకుని భరతనాట్యంలో శిక్షణ పొందారు. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి, తమిళ చిత్రం 'వెలైకారన్'తో కెరీర్ ప్రారంభించారు. తర్వాత తెలుగులో 'భలే మిత్రులు'తో ప్రేక్షకులకు పరిచయమైంది. 80ల చివర నుంచి 90ల వరకు స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోల సరసన వరుస విజయాలు సాధించారు. ముఖ్యంగా నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి టాప్ హీరోలతో నటించి స్టార్‌డమ్ అందుకుంది. ఇక 'నరసింహా'లో నీలాంబరి అనే నెగటివ్ షేడ్ పాత్రతో నటించి, తన నటనలో కొత్త కోణాన్ని చూపించారు. ఇక బాహుబలి లో 'శివగామి' పాత్ర ఆమె కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ అనే చెప్పాలి.
పెళ్లి ముందు రాత్రి షూటింగ్... ఇదే డెడికేషన్!
ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం మాత్రం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే. దర్శకుడు కృష్ణవంశీ తో 2003లో వివాహం చేసుకున్న రమ్యకృష్ణ... పెళ్లి రోజు ముందు కూడా షూటింగ్ ఆపలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సింహాద్రి (Simhadri) సినిమాలోని "చిన్నది అమ్మే చీకులు కావాలా" పాట కోసం చివరి నిమిషంలో షూటింగ్ ప్లాన్ చేయాల్సి వచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సాంగ్‌ను రాత్రంతా షూట్ చేయాల్సి వచ్చిందట. 'తెల్లవారితే నా పెళ్లి... అయినా కూడా నేను షూటింగ్ ఆపలేదు. రాత్రి 2 గంటల వరకు డ్యాన్స్ చేసి, అక్కడి నుంచి నేరుగా పెళ్లికి వెళ్లాను'అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రొఫెషనలిజం అంటే ఇదే!
సాధారణంగా పెళ్లి ముందు రోజు సెలబ్రిటీలు కూడా విశ్రాంతి తీసుకోవడం, ఫ్యామిలీతో గడపడం సహజం. కానీ రమ్యకృష్ణ మాత్రం తన పనికి ఇచ్చిన ప్రాధాన్యం వేరే స్థాయిలో ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. సినిమా కోసం వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన రోజున కూడా కట్టుబాటును పాటించడం... ఆమె ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌కు నిదర్శనం.
ఇదే కారణంగా ఆమె నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ... ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్‌గా నిలుస్తున్నారు. ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు రమ్యకృష్ణను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 'ఇదే నిజమైన డెడికేషన్', 'స్టార్ అంటే ఇలానే ఉండాలి', 'ప్రొఫెషన్‌కు ఇంత గౌరవం ఇవ్వడం అరుదు'అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications