50 ప్లస్‌లో జీన్స్ ప్యాంట్‌లో‌ .. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే గ్లామర్ షో , కెమెరాలకు చిక్కిన శివగామి

వెండి తెరపై ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే కలకాలం గుర్తుండిపోతారు. మహానటి సావిత్రి, భానుమతి, వాణిశ్రీ, శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్, సౌందర్య వంటి వారు మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో వీళ్లు తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇలాంటి వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ఆమె ముద్ర వేశారు. 50 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో సెగలు పుట్టిస్తున్నారు రమ్యకృష్ణ. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపారు రమ్యకృష్ణ. అందాల ఆరబోతే కాదు అద్భుతమైన నటిగానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అహంకారం, పొగరు, అమాయకత్వం నిండిన వేషాలతో పాటు పవర్‌ఫుల్ రోల్స్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. 1985లో భలేమిత్రులు మూవీతో తెలుగు వారిని పలకరించారు రమ్యకృష్ణ. ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ పడినా తనను తాను నిరూపించుకునే సమయం వచ్చే వరకు ఓపిక పట్టి తన నటనతోనే సమాధానం చెప్పారు. కే .విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు సినిమా రమ్యకృష్ణకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో భానుచందర్‌కు జోడీగా పల్లెటూరి పిల్లగా అద్భుతంగా జీవించారు రమ్యకృష్ణ.

ramya krishnan spotted with blue color jeans at shamshabad airport hyderabad

ఆ తర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన చిత్రాలు ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేశాయి. అల్లుడుగారు. అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లరి మొగుడు, బంగారు బుల్లోడు, మేజర్ చంద్రకాంత్, క్రిమినల్, హలో బ్రదర్, ముగ్గురు మొనగాళ్లు, అమ్మోరు, ధర్మచక్రం, అన్నమయ్య, ఆహ్వానం, కంటే కూతురినే కనాలిరా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాలు రమ్యకృష్ణకు మంచి పేరు తీసుకొచ్చాయి. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో దాదాపు 260కి పైగా సినిమాలు చేశారు రమ్యకృష్ణ.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన నరసింహలో నీలాంబరిగా ఆమె నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తనకు దక్కనివాడు ఇంకెవరికీ దక్కకూడదని పగతో రగిలిపోయే మహిళగా రమ్యకృష్ణ జీవించేశారు. రజనీ, సౌందర్యలనే డామినేట్ చేసేలా ఆ క్యారెక్టర్ ఉంటుందంటే అది రమ్యకష్ణ గొప్పతనం. ఈ సినిమాలో సౌందర్య భుజాలపై కాలుపెట్టే సీన్‌ని తొలుత చేయనని రమ్యకృష్ణ తేల్చిచెప్పారట. కానీ కేఎస్ రవికుమార్, సౌందర్యలు నచ్చజెప్పడంతో ఈ సన్నివేశంలో ఇరగదీశారు రమ్య.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడారు రమ్యకృష్ణ. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో రాజమాత శివగామి దేవిగా రాజసం పండించారు. 54 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో హాట్ హాట్ ఫోటోషూట్‌లలో పాల్గొంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. మొన్నామధ్య తన ముక్కుకు ముక్కుపుడక పెట్టించుకుని ఔరా అనిపించారు. తాజాగా టైట్ జీన్స్ వేసి, నల్లకళ్ల జోడు పెట్టుకుని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హల్ చల్ చేశారు రమ్యకృష్ణ. కొందరు కెమెరాలలో ఆమెను బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: ramya krishnan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X