ఇంట్రెస్టింగ్: మెగా కాంపౌండ్‌లోకి రమ్యకృష్ణ.. ఎవరూ ఊహించని పాత్రకు ఎంపిక
అందం, అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది సీనియర్ నటి రమ్యకృష్ణ. తన గ్లామర్‌తో అప్పటి తరానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈమె.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించింది. అంతేకాదు, అవార్డ్ విన్నింగ్స్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని అందరు స్టార్ హీరోలతో నటించింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఎన్నో ఇండస్ట్రీలో నటించింది. దీంతో ఈమె పేరు మారుమ్రోగిపోయింది. తాజాగా రమ్యకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

సెకెండ్ ఇన్నింగ్స్ అక్కడే.. కానీ శివగానే గుర్తుంటుంది
రమ్యకృష్ణ.. సిద్దార్ద్ - తమన్నా జంటగా నటించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా ద్వారా తల్లి క్యారెక్టర్లు చేయడం ప్రారంభించారు. ఈ సినిమాలో ఆమె చక్కని నటన కనబరిచారు. అయితే, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో ఆమె చేసిన ‘శివగామి' పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అక్కినేని హీరోలకు అత్తగా.. తల్లిగా.!
సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత రమ్యకృష్ణ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ‘బాహుబలి'కి ముందూ తర్వాత ఆమె ఎన్నో పాత్రలు చేశారు. ముఖ్యంగా అక్కినేని హీరోలు నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన'లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే, అక్కినేని అఖిల్‌కు తల్లిగా ‘హలో' అనే సినిమాలో, నాగ చైతన్యకు అత్తగా ‘శైలజా రెడ్డి అల్లుడు'లో నటించారు.

బుల్లి తెరపై గ్రాండ్ ఎంట్రీ
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్' సీజన్ -3కి రమ్యకృష్ణ హోస్ట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున గైర్హాజరు కావడంతో ఆమె రెండు రోజులు ఈ షోను హోస్ట్ చేశారు. ఇందుకు గానూ ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి మరీ కంటెస్టెంట్‌లతో సరదాగా గడిపారు. దీంతో ఆమె చేసిన ఈ రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.

మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ
రమ్యకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఈ జంట ఖాతాలో ఎన్నో మంచి చిత్రాలు ఉన్నాయి. అయితే, ఆమె పవన్‌తో గానీ, తర్వాతి తరంలోని హీరోలతో గానీ కలిసి నటించలేదు. ఎవరి సినిమాల్లోనూ కామియో రోల్స్ కూడా చేయలేదు. కానీ, తాజాగా ఆమె మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.
Recommended Video

ఏ పాత్ర చేయబోతున్నారంటే..
ఇటీవల ‘గద్దలకొండ గణేష్' అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేయబోయే సినిమాలో రమ్యకృష్ణ నటిస్తారని ఓ వార్త ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వరుణ్‌కు ఆమె తల్లిగా నటిస్తారట. ఈమె పాత్ర ఈ సినిమాకు ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఇది వరుణ్ బాక్సర్‌గా నటించే సినిమాలోనా..? లేక సురేందర్ రెడ్డి సినిమాలోనా..? అన్నది మాత్రం తెలియలేదు.


Click it and Unblock the Notifications











