56 ఏళ్ల వయసులోనూ రమ్యకృష్ణ క్రేజ్.. శివగామికి ఒక రోజు పారితోషికం ఎంతంటే?

కొందరు హీరోయిన్లను చూస్తే వారి వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఈ కోవలోకే వస్తారు అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణన్. ఒకప్పుడు హీరోయిన్‌గా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. ఆమెతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. వరుస సినిమాలతో ఆమె దూసుకెళ్తున్నారు. రెమ్యునరేషన్‌తోనూ రమ్యకృష్ణ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే...

1985లో భలేమిత్రులు మూవీతో తెలుగు తెరపై అడుగుపెట్టారు రమ్యకృష్ణ. తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్‌గా, చిన్నా చితకా పాత్రలలో నటించారు. ఈ దశలో రమ్యపై ఐరెన్ లెగ్ ట్యాగ్ వేశారు కొందరు. అయినప్పటికీ విమర్శలను తట్టుకుని నిలబడి తన నటనతోనే సమాధానమిచ్చారు రమ్యకృష్ణ. కళాతపస్వి కే . విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు చిత్రం ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కే రాఘవేంద్రరావు ఆస్థాన హీరోయిన్‌గా మారిన రమ్యకృష్ణకు ఎదురులేకుండా పోయింది.

Ramya Krishnan s Remuneration From Star Heroine to Highest-Paid Character Artist

అల్లుడుగారు. అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లరి మొగుడు, బంగారు బుల్లోడు, మేజర్ చంద్రకాంత్, క్రిమినల్, హలో బ్రదర్, ముగ్గురు మొనగాళ్లు, అమ్మోరు, ధర్మచక్రం, అన్నమయ్య, ఆహ్వానం, కంటే కూతురినే కనాలిరా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో దాదాపు 300 వరకు సినిమాలలో నటించారు.

విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌కు రమ్యకృష్ణ కేరాఫ్‌గా నిలిచి స్టార్ హీరోలకే సవాల్ విసిరారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆమె నటించిన నరసింహలో నీలాంబరిగా ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. రీసెంట్‌గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో శివగామి దేవిగా రమ్యకృష్ణ ఉగ్ర స్వరూపం చూపించారు. ఆమెను తప్పించి మరొకరిని ఆ పాత్రలో ప్రేక్షకులు ఊహించుకోలేరంటే అతిశయోక్తి కాదు.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడారు రమ్యకృష్ణ. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ప్రస్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో వస్తున్న రాకాలో కీలకపాత్రలో నటిస్తున్నారు రమ్యకృష్ణ. దీనితో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న జైలర్ 2లో ఆయన సరసన నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన స్టార్ పవర్ చూపిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన మార్కెట్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఆమె రోజువారీ కాల్షీట్స్ లెక్కన పారితోషికాన్ని తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి రమ్యకృష్ణ ఒకరోజు షూటింగ్‌లో పాల్గొన్నందుకు దాదాపు 10 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి 10 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే ఏకంగా కోటి రూపాయలు అందుకోవాల్సిందే. తద్వారా హీరోయిన్లతో సమానంగా రమ్యకృష్ణ పారితోషికం అందుకున్నట్లే. ఆమె తరం హీరోయిన్లు కానీ, ఇతర డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికంటే రమ్యకృష్ణ పారితోషికం ఎక్కువ. దీనిని బట్టి రమ్యకృష్ణ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

Read more about: ramya krishnan Raaka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X