చిరంజీవి చెల్లెలిగా తెలుగు హీరోయిన్.. కేవలం అందుకే ఒప్పుకున్నా అంటూ!
ఎవరి సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో పాటు డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ మెప్పించి స్టార్‌గా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకు పైగానే బడా హీరోగా సత్తా చాటుతోన్న ఆయన.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే మరింత జోష్‌తో కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో 'విశ్వంభర' అనే మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీశారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు.
టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిన రమ్య పసుపులేటిని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

రమ్య పసుపులేటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. 'విశ్వంభరలో చిరంజీవి గారి పక్కన సిస్టర్‌గా చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు కనిపిస్తాను. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి కానీ హీరోయిన్‌గా చేద్దామనే అవేవి ఒప్పుకోలేదు. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను' అని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలయికలో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, అషికా రంగనాథ్ కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











