బోల్డ్ పాత్రలో రమ్యకృష్ణ.. అంత పచ్చిగా రెచ్చిపోగలదా?

బాహుబలి దేవసేనగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దెచ్చుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటోంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ డిమాండ్ ఉన్న యాక్టర్ గా దేవసేన చలామణి అవుతోంది. రెమ్యునరేషన్ పరంగా కూడా రమ్యకృష్ణ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇకపోతే రమ్యకృష్ణ త్వరలోనే ఒక బోల్డ్ క్యారెక్టర్ లో డిఫరెంట్ గా దర్శనమివ్వబోతోందట.

హీరోయిన్స్ కంటే ఎక్కువ రేటు..

హీరోయిన్స్ కంటే ఎక్కువ రేటు..

డైలీ పేమెంట్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ ఓ విధంగా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదట. ఇప్పుడున్న కొంత మంది స్టార్ హీరోయిన్స్ ల కంటే ఆమె తీసుకునే మొత్తం ఎమౌంట్ చాలా ఎక్కువని తెలుస్తోంది. ఇక పాత్రల విషయంలో రమ్యకృష్ణ చాలా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటోంది. నచ్చకుంటే నచ్చలేదని మొహం మీదే చెప్పొస్తోందట.

యాంకర్ అనసూయకి పోటీగా..

యాంకర్ అనసూయకి పోటీగా..

రీసెంట్ గా ఒక బాలీవుడ్ రీమేక్ సినిమా కోసం తెలుగులో రమ్యకృష్ణ ని సంప్రదించారట. అసలైతే ఆ పాత్రను మొదట అనసూయ కోసం అనుకున్నారట. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ హిట్టు బొమ్మ, ఆయుష్మాన్ ఖురాన నటించిన 'అందాదున్'. అందులో టబు చేసిన పాత్ర కోసం తెలుగులో వివిధ రకాల యాక్టర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. తెలుగులో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే టబు చేసిన పాత్రలో మొన్నటి వరకు అనసూయ నటిస్తున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు ఆ పాత్ర కోసం రమ్యకృష్ణని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

ఆ పాత్రలో అంత పచ్చిగా రెచ్చిపొగలదా..

ఆ పాత్రలో అంత పచ్చిగా రెచ్చిపొగలదా..

బోల్డ్ పాత్రలు అనగానే కేవలం హాట్ గానే కాకుండా యాక్టింగ్ లో కూడా చాలా తెగించి నటించాల్సి ఉంటుంది. అందులో టబు మాదిరిగా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాలి అంటే స్టార్ రేంజ్ ని పక్కనపెట్టాలి. అనసూయ అయితే కాస్త టబుకి తగ్గట్టుగా ఉంటుంది కానీ అందులో ఆడియెన్స్ కి కొత్తగా ఏమి అనిపించదనే టాక్ వస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తెలుగులో కాస్త డిఫరెంట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే రమ్యకృష్ణతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Recommended Video

Hero Nithiin Donated 10 Lakhs Each To Telugu States
దర్శకుడి కొత్త స్క్రిప్ట్..

దర్శకుడి కొత్త స్క్రిప్ట్..

అందాదున్ తెలుగు రీమేక్ కోసం నితిన్ మెర్లపాక గాంధీని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణార్జున యుద్ధం వంటి డిజాస్టర్ సినిమా తీసినప్పటికి నితిన్ ఈ కమర్షియల్ దర్శకుడిని ఎంచుకోవడానికి గల కారణం ఎవరికి అర్థం కావడం లేదు. అయితే గాంధీ మాత్రం అందాదున్ కథను పూర్తిగా తన స్టైల్ లోకి మార్చి కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడట. అది నచ్చడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X