ప్రభాస్‌ను వదిలేసి.. సైలెంట్‌గా రానాతో అనుష్కశెట్టి
Recommended Video

బాహుబలి మూవీ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బ్యూటీ అనుష్క మధ్య అఫైర్ గురించి లెక్కలేనని కథనాలు, రూమర్లు వినిపించాయి. అయితే వారిద్దరూ వాటిపై పెద్దగా స్పందించకపోగా తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. ఇంకా మాట్లాడితే మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అనే డైలాగ్ వినిపించారు. బాహుబలి తర్వాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఆ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్న తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సైలెంట్ చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రానికి సంబంధించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే..

భాగమతి తర్వాత అనుష్కశెట్టి
స్థూలకాయాన్ని తగ్గించుకొన్న తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం సైలెన్స్. ఈ చిత్రంలో అనుష్క ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడని పాత్రలో కనిపిస్తున్నారట. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఓ కీలకపాత్రలో నటించడం చర్చనీయాంశమైంది. ప్రత్యేక పాత్రలో ప్రభాస్ కాకుండా రానాకు అనుష్క ఓటేయ్యడం క్రేజీగా మారింది.

అనుష్కతో రానా దగ్గుబాటి
ఇక సైలెన్స్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం బహుభాషల్లో రూపొందుతున్నది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెకకతున్నది. తొలుత ఈ సినిమా కోసం ప్రభాస్‌ను సంప్రదించారట. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తాను చేయలేనని చెప్పడంతో రానాను ఆ పాత్రలోకి దించారు. దాంతో రానా, అనుష్క కలిసి నటించేందుకు మార్గం సుగమైంది.

హాలీవుడ్ హీరో మైఖేల్ మ్యాడ్సన్
సైలెన్స్ మూవీలో హాలీవుడ్ నటుడు, కిల్ బిల్ ఫేం మైఖేల్ మ్యాడ్సన్ నటిస్తున్నారు. మాధవన్, రానా, అనుష్కతోపాటు మరికొందరు ప్రముఖ నటులు ఈ సినిమాలో పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌కు వెళ్లనున్నది. రానా చేరికతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది.

వరుస సినిమాలతో రానా దగ్గుబాటి
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే జాన్ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నది. హౌస్‌ఫుల్ సిరీస్, రానా హాథీ మేరి సాథీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు త్వరలోనే ప్రారంభం కానున్నది. అలాగే వేణు ఊడుగుల దర్శకత్వం వహించే విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవితో కలిసి నటించనున్నాడు.

మార్చిలో యూఎస్‌కు సైలెంట్ టీమ్
అనుష్క సైలెంట్ సినిమా కోసం వేచి చూస్తున్నది. అమెరికాలో జరిగే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే అక్కడికి వెళ్లనున్నది. వస్తాడు నా రాజు దర్శకుడు హేమంత మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం షూటింగ్ యూఎస్‌లో ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











