దీపికా వివాదంపై రానా షాకింగ్ కామెంట్.. సినిమా అంటే ఉద్యోగం కాదంటూ..

Deepika - Rana Daggubati: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇటీవల 'రోజుకు ఎనిమిది గంటల పని' అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. ఇంతకీ సినిమా పరిశ్రమలో పని గంటలు ఎంత? నటీనటులు రోజుకు ఎన్ని గంటలు షూటింగ్ చేయాలి? అనే ప్రశ్నలు ఎప్పుడూ చర్చల్లో ఉంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, ఫిల్మ్ మేకర్స్, ఇండస్ట్రీ వర్కర్స్ తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. కొంతమంది దీపికా వాదనను సమర్ధించగా.. మరికొందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే 'రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి' అనే కామెంట్ దేశవ్యాప్తంగా కొత్త డిబేట్‌కు దారితీసింది. ప్రసవం తర్వాత తల్లులు ఎదుర్కొనే శారీరక-మానసిక ఒత్తిడి గురించి దీపిక మాట్లాడుతూ .. నటీమణులు కూడా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మన ఆరోగ్యంగా ఉంటేనే.. ఎనిమిది గంటల్లోనే పనిని ముగించగలం. అవసరం లేని ఒత్తిడిలో ఎక్కువసేపు పని చేయడం మంచిది కాదు" అనేది తన ఆమె వాదన.

Rana Daggubati Reacts Deepika Padukone s 8-Hour Workday Comment Sparks Industry Debate

దీపిక అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు సమర్థించారు. అయితే ఈ వ్యాఖ్యలు కొందరికీ నచ్చలేదు. కొందరు దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా చేసిన వ్యాఖ్యలుగా అభివర్ణించారు. సినిమా షూటింగ్ కు ఫిక్స్డ్ టైం ఉండదనీ, క్రియేటీవిటీ, ప్రిపరేషన్ అనేవి గంటల లెక్కలకు సరిహద్దులు పెట్టలేనివని విమర్శకులు చెబుతున్నారు. అంతేకాక, ఈ కారణంగానే దీపికను స్పిరిట్, కల్కి 2898 AD పార్ట్ 2 వంటి భారీ ప్రాజెక్టుల నుంచి మేకర్స్ తొలగించారనే సమాచారం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

తాజాగా ఈ అంశంపై రానా (Rana Daggubati) స్పందిస్తూ అన్ని రంగాల కంటే సినీ రంగం భిన్నమైనదని అన్నారు.'నటన అంటే ఉద్యోగం కాదు. ఇది ఒక జీవనశైలి. దీనిని జీవితంలో అలవాటు చేసుకోవాలి. నటుడు చేసే పని 9- 5 నిబంధనల్లో సరిహద్దులు పెట్టుకోలేం. ఈ జీవనశైలి మీకు సరిపోతుందా? అనేది పూర్తిగా మీ నిర్ణయం 'అని రానా అన్నారు. షూటింగ్‌కు ఒక నిర్దిష్ట టైమ్ ఫ్రేమ్ పెట్టడం కష్టమని, ఒక సన్నివేశాన్ని డిజైన్ చేయడం నుంచి అవుట్‌పుట్ రావడం వరకు అన్ని విభాగాలు కలిసి పని చేయాల్సిందేనని ఆయన గమనించారు.

'ఎనిమిది గంటలు కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగం కాదు ఇది. ప్రతి సన్నివేశం ఇన్‌వాల్వ్‌మెంట్, రియాక్షన్‌ ఉంటుంది. అందులో అన్ని విభాగాల కళాకారులు కలిసి పాల్గొన్నప్పుడే మెరుగైన ఫలితం వస్తుంది," అంటూ రానా ఫిల్మ్ మేకింగ్ లోని కష్టాలను వివరించారు. అందువల్ల సినిమా షూటింగ్‌కు ఫిక్స్డ్ టైం పెట్టడం కష్టమే అన్నది హీరో రానా భావన.

ఇదే అంశంపై దుల్కర్ సల్మాన్ కూడా తన అనుభవాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమల్లో వర్క్ మోడల్ ఒక్కటే కాకుండా భిన్నంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. "మలయాళ పరిశ్రమలో షూటింగ్ మొదలైతే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టం. అయితే తెలుగు ఇండస్ట్రీలో మహానటి చేస్తున్నప్పుడు కొన్ని రోజులు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది" అని తన అనుభవాన్ని చెప్పాడు.

తమిళ పరిశ్రమలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుందని దుల్కర్ తెలిపారు. 'తమిళంలో రెండు రోజు సెలవులిస్తారు. ఒకే రోజు అధికంగా షూట్ చేయడం కంటే, ప్రతిరోజూ కొంచెం అదనంగా పనిచేయడం మంచిదన్న అభిప్రాయం అక్కడ ఉంటుంది" అంటూ ఆయన వివరించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X