Samantha - Rana: అప్పుడు మరదలు.. ఇప్పుడు చెల్లెలు.. సమంతపై రానా కామెంట్స్
Samantha: హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది సమంత. వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మారింది. అయితే.. ఓ ఏడాదికాలం అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంది. ఆ తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది సమంత. రీసెంట్‌గా 'సిటాడెల్: హనీ బన్నీ'(Citadel: Honey Bunny) సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇదిలాఉంటే.. ఈ మధ్యకాలంలో సమంత నిత్యం వార్తలో నిలుస్తోంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఐఫా (IIFA) ఉత్సవం 2024 వేడుకలు అబుదాబిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్'(Woman of the Year in Indian Cinema)అవార్డు ఎన్నికైంది. సమంతా ఈ అవార్డును హీరో విక్కీ కౌశల్ చేతుల మీదుగా అందుకుంది. ఈ సందర్బంగా సమంతా ఎమోషనల్ మాట్లాడుతూ.. తన స్పీచ్ ఇస్తుంది. అవార్డు ప్రధానోత్సవం తర్వాత సమంతను ఉద్దేశించి హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ' టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వెళ్ళింది.. ఒకప్పుడు సిస్టర్ ఇన్ లా నుండి సిస్టర్ అయింది అంటూ కామెంట్ చేశారు. నీతో రియాక్ట్ అయినా సమంత ..'నువ్వు నువ్వే సెల్ఫ్ రోలింగ్ చేసుకుంటున్నావా? ' అంటూ కౌంటర్ చేసింది.

ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి 'నువ్వు తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు?'అంటూ రానా ప్రశ్నిస్తాడు. వెంటనే సమంత రియాక్ట్ అవుతూ.. 'నువ్వెందుకు చేయట్లేదు 'అని రివర్స్ క్యష్షన్ వేస్తుంది. దీంతో రానా.. 'నన్ను ఎవరు తీసుకోవట్లేదు' అని చెప్పగా.. సమంత మాట్లాడుతూ.. 'నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా మనం సినిమా చేయాలంటే.. నరసింహనాయుడు లెవల్లో ఉండాలి. కానీ, రానా నాయుడు లా ఉండకూడదు కదా' అని స్ట్రాంగ్ కౌంటర్ వేస్తుంది సమంత.
'అది సినిమా కాదు అక్క .. అది షో.. షోలో ఏమైనా చేసుకోవచ్చు. అది కూడా మీ ఫ్యామిలీ మెన్ సిరీస్ చూసి నేర్చుకున్నా' అంటూ రానా రివర్స్ పంచ్ వేశాడు రానా.
ఇంతలో పక్కనే ఉన్న యంగ్ హీరో తేజ సజ్జ .. వారి కన్వర్జేషన్ లో ఎంట్రీ అయి..'టాలీవుడ్ లో ఉన్నంత సేపు ఆమె సమంత రూత్ ప్రభు.. బాలీవుడ్లో అడుగు పెట్టాక సమంత రూడ్ ప్రభుగా మారింది ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. ఈ కామెంట్స్ తో సమంతా కూడా షాక్ అవుతుంది. రానా కూడా రియాక్ట్ అయి.. 'గురూ నేను చిన్నప్పటి నుండి ఆమెని రూడ్ ప్రభు,రూడ్ లెస్ ప్రభు అనే పిలుస్తున్నానంటూ ఓపెన్ అయ్యారు. ఆ తర్వాత ' కామెడీ సామ్ ఎటు పోయింది అని సమంత ప్రశ్నించగా.. ప్రస్తుతం కాంట్రవర్సీ సామ్ గా మారింది అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది సమంత.
ఇదిలాఉంటే.. టాలీవుడ్ స్టార్ హీరోస్ రానా, వెంకటేష్ కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ నటించారు. ఈ వెబ్ సిరీస్ ను చాలా బోల్డ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ సమంత కూడా.. ' ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సీరిస్ లో నటించింది. ఈ సీరిస్ లో సమంత బోల్డ్ గా కనపడి అదరగొట్టింది. ఇదెలా ఉంటే.. హీరో రానాకు సమంత చెల్లెలు అవుతోంది. ఎలా అంటే.. రానా దగ్గుబాటి మేనత్త కొడుకు అక్కినేని నాగ చైతన్య అని తెలిసిందే. దీంతో సమంత .. రానాకు
చెల్లిగా మారింది. ఆ రిలేషన్ తోనే అప్పుడు సిస్టర్ ఇన్ లా.. ఇప్పుడూ సిస్టర్ అంటూ కామెంట్ చేశారు రానా.


Click it and Unblock the Notifications











