Rashmika Mandanna : రష్మిక మందన్న కాళ్ల దగ్గరకి బిగ్‌స్టార్స్ .. హీరోలనే మించేలా డామినేషన్!
కిరాక్ పార్టీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా ఎదిగారు. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప సినిమాలు రష్మికకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. తెలుగులో వచ్చిన పాపులారిటీతో ఆమెకు బాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ అవకాశాలు దక్కాయి. ఇప్పడు ఇండియాలోని స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా రష్మిక వెలుగొందుతున్నారు.
తొలుత బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది రష్మిక. గతేడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్‌తో హిందీ జనాలకు మరింత దగ్గరయ్యారు రష్మిక మందన్న. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా మెస్మరైజ్ చేయనున్నారు. పుష్ప ప్రభంజనం నేపథ్యంలో పుష్ప ది రూల్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకరాం తొలుత ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన పుష్ప ది రూల్‌ను డిసెంబర్ 5కు వాయిదా వేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 17న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో పుష్ప 2 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి వ్యూస్‌తో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రభాస్ నటించిన సలార్ వ్యూస్‌లను అధిగమించింది.

అయితే ట్రైలర్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. ఓ చోట రష్మిక కాళ్ల దగ్గర అల్లు అర్జున్ ఉంటాడు. ఆమె పాదాలను గడ్డం కిందగా తీసుకెళ్లి తగ్గేదె లే అంటాడు. శ్రీవల్లి నా పెళ్ళాం.. పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అంటాడు అల్లు అర్జున్. అంత పెద్ద స్టార్ హీరోని హీరోయిన్ కాళ్ల దగ్గర పడేస్తావా అంటూ బన్నీ ఫ్యాన్స్ సుకుమార్‌పై మండిపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో రష్మిక సంబంధించిన మరో వీడియో కూడా డిస్కషన్స్‌లోకి వచ్చింది.

రష్మిక ఓ స్టార్ హీరోతో కాళ్లు పట్టించుకోవడం ఇదే తొలిసారి కాదు. యానిమల్ చిత్రంలో ఏకంగా రణబీర్ కపూర్‌తోనే కాళ్లు పట్టించుకుని అతనితో క్షమాపణలు చెప్పించుకునే సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్పలోని ఈ సీన్ సైతం సినిమాకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఇద్దరు సూపర్‌స్టార్లను కాళ్ల దగ్గర కట్టేసుకున్న రష్మిక మామూల్ది కాదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











