చిక్కుల్లో కంగన రనౌత్‌.. టెర్రరిస్టులు, కాల్చి చంపేయాలి వ్యాఖ్యలపై కేసు

బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. సోదరి రంగోలీ చందేల్ కారణంగా ఆమె ఓ కేసులో ఇరుక్కున్నారు. సోషల్ మీడియాలో రంగోలీ పోస్టు చేసిన వీడియోను సమర్ధించినందుకు గాను ఆమెపై కేసు నమోదైంది. కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఇటీవల ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనపై కేసు నమోదు కావడం మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

ప్రజలను రెచ్చగొట్టే విధంగా

ప్రజలను రెచ్చగొట్టే విధంగా

కంగన సోదరి రంగోలీ ఓ కమ్యూనిటీ ప్రజలను టార్గెట్ చేసుకొని టెర్రిరిస్టులు అంటూ కామెంట్ చేశారు. విద్వేష పూరితమైన తన వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్‌ను తొలగించింది అని ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ఫిర్యాదు చేశారు. మరణహోమం, హింసను సృష్టించేలా రంగోలి కామెంట్ చేస్తే.. దానికి కంగన మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా నిరసనలకు, వివాదానికి దారి తీసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్వప్రయోజనాల కోసం

స్వప్రయోజనాల కోసం

తనకు ఉన్న ప్రేక్షకదారణను, ప్రతిష్టను, డబ్బు, హోదా, పలుకుబడిని దుర్వినియోగం చేశారు. సమాజంలో అసమానతలను సృష్టించడానికి, స్వప్రయోజనాల కోసం ఓ వర్గాన్ని మరో వర్గంపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు అని న్యాయవాది దేశ్‌ముఖ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంగన, సోదరి రంగోలి, ఆమె మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.

 మొరాదాబాద్ ఘటన నేపథ్యంలో

మొరాదాబాద్ ఘటన నేపథ్యంలో

మొరాదాబాద్‌లో వైద్యులు, పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఓ వర్గం చేసిన దాడికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వీడియోను ఉద్దేశించి రంగోలి పరుషమైన పదాలతో వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోకు, సోదరి వ్యాఖ్యలను ఉద్దేశించి కంగన వ్యాఖ్యలు చేస్తూ సమర్ధించారు. ఆ ఘటన వివాదం కావడంతో కంగన తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. తాను గానీ, తన సోదరి చేసిన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్లేయితే వారికి మా క్షమాపణలు తెలియజేస్తున్నాం అని అన్నారు.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
కంగన రనౌత్ స్పందన

కంగన రనౌత్ స్పందన

వైద్యులు, పోలీసులపై దాడి చేసిన వర్గాన్ని కాల్చి చంపేయాలని నా సోదరి కామెంట్ చేసింది. అయితే ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విదంగా రంగోలీ వ్యాఖ్యలు చేశారంటూ సినీ ప్రముఖులు ఫరా అలీ ఖాన్, రీమా కంగ్తీ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఓ వర్గంలో కొందరు చేసిన పనికి అందరూ బాధ్యులు ఎలా అవుతారు అని కంగన పేర్కన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X