102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. హీరోయిన్ కి ఊహించని షాక్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ బంగారం రవాణా కేసు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటి హర్షవర్ధిని రన్యా అలియాస్ రన్యా రావు ఊహించిన షాక్ తగిలింది. ఈ భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)వివరాలు ప్రకారం.. నటి రన్యా రావు కేవలం ఒకే ఏడాదిలో రూ.102.55 కోట్ల విలువైన 127 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా భారత్‌కు రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బెంగళూరులోని పీఎంఎల్ఏ (PMLA)ప్రత్యేక కోర్టులో నటి రన్యా రావుతో పాటు ఆమె కీలక సహచరులు తరుణ్ కొండూర్, సాహిల్ సకారియా జైన్‌లపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.

Ranya Rao Gold Smuggling Case ED Files Chargesheet Against Kannada Actress in 102 Crore Scam

ఇంతకీ ఈ కేసు ఏంటీ ?
అక్రమ బంగారం రవాణా కేసు 2025 మార్చి 3న ప్రారంభమైంది. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నిర్దిష్ట సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె వద్ద దాచిన 14.213 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.12.56 కోట్లు అని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో నటి అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది.

ఇక అరెస్ట్ అనంతరం ఆమె నివాసంతో పాటు తన కార్యాలయాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు బయటపడింది. వీటికి సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో మరింత అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు దర్యాప్తు ను మరింత లోతుగా సాగించగా.. ఆమె పర్సనల్ యాక్టివిట్ మాత్రమే కాకుండా.. ఆమె వెనుక ఉన్న నెట్‌వర్క్ కూడా బయటపడింది.

ఈ దర్యాప్తులో నటి రన్యా రావు మార్చి 2024 నుంచి మార్చి 2025 వరకు సుమారు 127 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. విదేశాల నుంచి తెచ్చిన బంగారాన్ని దేశీయ మార్కెట్‌లో జ్యువెలర్ల, హ్యాండ్లర్ల నెట్‌వర్క్ ద్వారా విక్రయించి, వచ్చిన నగదును హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఆరోపించారు.
అనంతరం ఆ డబ్బును పలు నకిలీ బ్యాంక్ ఖాతాలు, షెల్ కంపెనీల ద్వారా చట్టబద్ధమైన వ్యాపార ఆదాయంగా చూపించి మనీ లాండరింగ్ చేసినట్లు ఈడీ వివరించింది.

ఇదే సమయంలో ఈ కేసులో విదేశీ లావాదేవీలు ఉండటంతో ఈడీ ప్రత్యేకంగా పీఎంఎల్ఏ (PMLA)చట్టం కింద దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సమయంలో డిజిటల్ పరికరాలు, పత్రాలు, ఇండియన్ కరెన్స్ తో పాటు విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలా పలువురి వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. పలు చట్టాల కింద నమోదు చేశారు.

ప్రస్తుతం రన్యా రావు, ఆమె సహచరులు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వాస్తవానికి సెలబ్రిటీగా ఉండటం వల్ల ఎయిర్‌పోర్ట్ తనిఖీల్లో ఎక్కువగా అనుమానం రాకపోవచ్చనే భావనతో ఈ స్మగ్లింగ్ కొనసాగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: Ranya Rao kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X