twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలతో రొమాంటిక్ సన్నివేశాలు.. అలా చేస్తే చాలా ఈజీ: రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్

    |

    గ్లామరస్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా కనిపిస్తున్న రాశిఖన్నా ఈసారి పక్కా కమర్షియల్ సినిమాతో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమైంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రస్తుతం అయితే మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా గోపీచంద్ తరహాలోనే లాయర్ పాత్రలో కనిపించబోతోంది.

    ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా ఆమె ఎన్నో విభిన్నమైన విషయాలపై స్పందించే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా రాశి కన్నా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చాలా ఈజీ అని వివరణ ఇవ్వడం విశేషం. చాలామంది నటీనటులు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడుతుంటామని చెబుతూ ఉంటారు. కానీ రాశి కన్నా మాత్రం తనకు మిగతా సన్నివేశాల్లో నటించడం కన్నా రొమాన్స్ సీన్స్ చేయడం చాలా సులభం అని తెలియజేసింది.

    Rashi Khanna about romantic scenes and comedy characters

    ఇక కామెడీ చేయడం అంటే చాలా కష్టం అంటూ ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో ఎక్కువగా రొమాంటిక్స్ పాత్రలే చేశాను అని ఇప్పుడు మాత్రం పక్కా కమర్షియల్ సినిమాలో కామెడీ చాలా భిన్నంగా కొత్తగా ఉంటుంది అని తెలియజేసింది. అంతేకాకుండా తన పాత్ర ద్వారా చాలా హ్యాపీగా నవ్వుకోవచ్చు అని కూడా ఈ బ్యూటీ వివరణ ఇవ్వడం విశేషం.

    ఇక జూలై 1వ తేదీన పక్కా కమర్షియల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో హీరో గోపీచంద్ కూడా ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలి అని చూస్తున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా అతనికి బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు లేవు. ఇక మంచి ఫామ్ లో ఉన్న మారుతి ఈ సినిమాను తరికెక్కించడంతో ఓపెనింగ్స్ అయితే భారీగానే అందుకునే అవకాశం ఉంది. మరి గోపీచంద్ ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    Rashi Khanna about romantic scenes and comedy characters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X