హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమైన రాశి ఖన్నా.. మరోసారి మెగా హీరో సేవ్ చేస్తాడా?

హాట్ బ్యూటీ రాశి ఖన్నా బ్యాడ్ లక్కేమిటో గాని ఇంకా స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బబ్లీ గర్ల్ మొదట్లో కాస్త జాగ్రత్తగా అడుగులు వేసింది. తొలి ప్రేమ వరకు కూడా కెరీర్ బాగానే కొనసాగింది. ఆ సినిమా హిట్టవ్వడం వలన రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెంచింది. ఇక ఆ తరువాత ఆఫర్స్ వచ్చాయి గాని అగ్ర హీరోలతో ఛాన్స్ అందుకోలేదు.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఏ స్థాయిలో ట్రోలింగ్ కు గురయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తరువాత తెలుగు ఆఫర్స్ పూర్తిగా తగ్గాయి. తమిళ్ లోనే కొన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా వెండితెరపై మరోసారి మెగా హీరోతో రొమాన్స్ చేసే అవకాశం దొరికినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా , సాయి ధరమ్ తేజ్ తో మొదట సుప్రీమ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Rashi khanna another golden opportunity in mega film

ఆ సినిమా అనంతరం ప్రతి రోజు పండగే సినిమాలో కూడా నటించారు. ఈ కాంబోకి వరుసగా రెండు విజయాలు దక్కడంతో మూడోసారి కూడా కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. సుకుమార్ ప్రొడక్షన్ లో సాయి ధరమ్ చేస్తున్న కొత్త సినిమాలో రాశి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ సారి రాశి ఖన్నా మెగా హీరోతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. రాశి ఖన్నా ప్రస్తుతం తమిళ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X