మరోసారి తప్పులో కాలేసిన రాశీ ఖన్నా.. ఆ హీరో కోసం

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో రాశి ఖన్నా కెరీర్ ఒక్కసారిగా మలువు తిరిగిందనే చెప్పాలి. ఓ విధంగా ఊహించని డిజాస్టర్స్ తగలడం కొన్నిసార్లు తారల జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది. ఓ విధంగా రాశి ఖన్నా ఆ అపజయం నుంచి చాలా పాఠాలు నేర్చుకుంది. అందుకే తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం లేదు.

స్టార్ హీరోయిన్ అవ్వాలని..

స్టార్ హీరోయిన్ అవ్వాలని..

ఇటీవల ఒక పెద్ద సినిమా కోసం చిన్న సినిమాలు వదిలేసుకుందట. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని గత కొన్నాళ్లుగా అమ్మడు తీవ్రంగా కష్టపడింది. అసలే హీరోయిన్స్ కొరత ఎక్కువైన సమయంలో బేబి ఈ టైమ్ ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని అనుకుంది. కానీ అది కుదరలేదు. వరుస అపజయాలు అమ్మడిని కుదురుకొనివ్వలేదు.

బిగ్ బడ్జెట్ మూవీలో..

బిగ్ బడ్జెట్ మూవీలో..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రాశి ఖన్నా తన సూర్య బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమా కోసం ఒక రెండు తెలుగు సినిమాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. సింగం సినిమాల దర్శకుడు హరి నెక్స్ట్ సూర్యతో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

ఆ సినిమా కోసం..

ఆ సినిమా కోసం..

అయితే లాక్ డౌన్ అనంతరం సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్న చిత్ర యూనిట్ కి రాశి ఖన్నా కాస్త ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి వస్తోందట. కెరీర్ సెట్ చేసుకోవాలి అంటే ఇలాంటి కాంబినేషన్ లో ఒక బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని పూర్తిగా అమ్మడు సూర్య సినిమా కోసమే వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
స్పెషల్ ఫోకస్..

స్పెషల్ ఫోకస్..

ఆ ఒక్క సినిమా సక్సెస్ అయితే రాశి ఖన్నా కెరీర్ యూ టర్న్ తీసుకోవడం కాయం. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తరువాత రాశి ఖన్నా కొన్నాళ్లపాటు కోలీవుడ్ లోనే మకాం వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ సైడ్ కూడా ఇప్పుడే ప్రయత్నాలు జరపాలని చూస్తున్న రాశి ఖన్నా ఇక నుంచి కేవలం పాత్రలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుతెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X