రాజమౌళి సినిమా ఆడిషన్‌లో రాశి ఖన్నా.. ఆ కారణంతో రిజెక్ట్ చేసిన జక్కన్న!

దర్శకధీరుడు రాజమౌళి అడగాలి గాని ఏ స్టార్ అయినా సరే ఎంత బిజీగా ఉన్నా సరే సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఆయన సినిమాల్లో నటించాలి అని ఉంది అని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అయితే ఒక హీరోయిన్ కు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందట. ఆమె మరెవరో కాదు. క్యూట్ బబ్లీ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న రాశి ఖన్నా. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాజమౌళి సినిమాలో మిస్ చేసుకున్న అవకాశం గురించి తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

అవకాశాలు వస్తున్నా..

అవకాశాలు వస్తున్నా..

క్యూట్ బబ్లీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రాశి కన్నా చాలాకాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే ఆమె కెరీర్ అనుకున్నంత రేంజ్ లో అయితే ఇంతవరకు పెద్ద హీరోలతో అవకాశాలు అందుకోలేకపోయింది. ఓ వర్గం మీడియం రేంజ్ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి కానీ అగ్ర దర్శకుల పాన్ ఇండియా సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు.

గ్యాప్ లేకుండా సినిమాలు

గ్యాప్ లేకుండా సినిమాలు

అయితే రాశి ఖన్నా కేవలం గ్లామర్ డోస్ మాత్రమే పెంచకుండా అప్పుడప్పుడు ప్రయోగాత్మకమైన పాత్రల్లో కూడా మెప్పించే ప్రయత్నం చేస్తుంది. వీలైనంతవరకు తనలోని సరికొత్త నటనను బయటకు తీస్తోంది. అయితే ఆ విధంగా చేసిన కొన్ని ప్రయత్నాలు బాగానే సక్సెస్ అయినప్పటికీ మరికొన్ని డిజాస్టర్ అయ్యాయి. అవేమీ లెక్క చేయకుండా రాశి ఖన్నా అటు తమిళంలో ఇటు తెలుగులో మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది.

రాజమౌళి సినిమాలో..

రాజమౌళి సినిమాలో..

ఇక రాశి ఖన్నా, రాజమౌళి సినిమాలో కూడా నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాజమౌళి సినిమా ఆడిషన్స్ లో ఒకసారి పాల్గొన్నట్లు కూడా తెలియజేసింది. అయితే ఆ సినిమా కథకు ఆమె అంతగా సెట్ అవ్వదు అని రాజమౌళి చాలా సున్నితంగానే తిరస్కరించినట్లుగా ఆమె తెలియజేసింది.

బాహుబలి కోసం ఆడిషన్స్

బాహుబలి కోసం ఆడిషన్స్

రాజమౌళి మొదట బాహుబలి సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారట. ముఖ్యంగా అవంతిక పాత్రకు తమన్నా కంటే ముందు కొందరిని అనుకున్నారు. అందులో రాశి ఖన్నా కూడా ఉందట. ఇక ఆడిషన్ నిర్వహించినప్పుడు అందులో రాశి ఖన్నా పాల్గొంది. కానీ ఆమె మరీ ఎక్కువగా క్యూట్ గా ఉండడం వలన రాజమౌళి ఆ పాత్రకు ఆమెను ఊహించుకోలేక రిజెక్ట్ చేశాడట.

ఆ సినిమాలో అవకాశం వచ్చేలా..

ఆ సినిమాలో అవకాశం వచ్చేలా..

బాహుబలి సినిమాకు రాశిని రిజెక్ట్ చేసినప్పటికీ వెంటనే మరో సినిమాలో మాత్రం ఆమెకు అవకాశం ఇప్పించేలా చేసినట్లు రాశి ఖన్నా తెలియజేసింది. రాజమౌళితో ఈగ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి అప్పుడే ఊహలు గుసగుసలాడే సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఆ సినిమా కథ గురించి తెలుసుకున్న రాజమౌళి అలాంటి లవ్ స్టోరీకి నువ్ సెట్ అవుతావాని ఒకసారి ఆ సినిమా నిర్మాతను కలవమని చెప్పారట. ఆ విధంగా రాశి, రాజమౌళితో మిస్ చేసుకున్న అవకాశం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X