Rashi Khanna: తగ్గేదే లే అంటున్న రాశీ ఖన్నా హాట్ షో.. అవే చూపిస్తూ ఫొటోలు!
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. సాధారణంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కాలంలో సౌత్ తో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ హవాను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే రచ్చ చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలు పెడుతూ మరింతగా హైలెట్ అవుతోంది. తాజాగా మరికొన్ని పోస్ట్ చేసింది.

కంటెంట్ ఉన్న చిత్రాల్లో..
టాలీవుడ్ అందమైన హీరోయిన్లలో ఒకరైనా రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే కెరీర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

జాన్ అబ్రహం మూవీ..
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. జాన్ అబ్రహం హీరోగా చేసిన ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. దీంతో పలు భాషల్లో ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాశి ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం రాశీ ఖన్నా ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

తెలుగులో మంచి ఎంట్రీ..
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడేలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. యాక్టింగ్ పరంగానూ ఫిదా చేసేసింది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో తెగ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది. తెలుగులో ఘనంగా ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా వరుసగా అవకాశాలు దక్కించుకుని హవాను చాటింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

పెద్దగా విజయం సాధించక..
కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు సినిమాలు చేసి సత్తా చాటింది. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది రాశీ ఖన్నా. కానీ ఈ చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది.

అలాంటి సీన్లతో షాక్..
బాలీవుడ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా. ఇప్పుడు యోధ అనే సినిమాతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రాశీ ఖన్నాతో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో షాహిద్ తో ఘాటు చుంబన సీన్లలో నటించి షాక్ ఇచ్చింది.

కెరీర్ లో దూసుకుపోతూ..
ఇలా హిందీ, కోలీవుడ్, మాలీవుడ్ అంటూ వివిధ సినీ ఇండస్ట్రీలలో నటిస్తూ సత్తా చాటుతోంది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతే సందడి చేస్తోంది. నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు పర్సనల్, కెరీర్ విషయాలు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ అట్రాక్ట్ చేస్తోంది ఈ బబ్లీ గర్ల్.
అటువైపు తిరిగి ఎక్స్ పోజింగ్..
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న రాశీ ఖన్నా తాజాగా మరి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన రాశీ ఖన్నా అందాలతో ఆకట్టుకుంది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా బాల్కనీలో నిల్చుని వయ్యారంగా పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో అటు తిరిగి ఇటు బ్యాక్ అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా పోజులిచ్చింది ఈ బబ్లీ బ్యూటి. బ్యాక్ తో పాటు షోల్డర్ అందాలు ఆరబోసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











